ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగష్టు 8న బందుకు పిలుపు.. AP Manyam Bandh
AP Manyam Bandh August 8th 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 8న మన్యం బందుకు పిలుస్తున్నట్టు ఆదివాసి JAC ప్రకటించారు. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే..

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 8వ తేదీన మాన్యం బందుకు పిలుస్తున్నట్లు ఆదివాసి జేఏసీ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించే జీవో నం.3/2000ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. అలాగే 50% గిరిజన జనాభా కలిగిన ప్రాంతాలకు షెడ్యూల్ ప్రాంతాలలో చేర్చాలని తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా సీఎం వీటిపై ప్రకటన చేయవలసిందిగా స్పష్టం చేస్తున్నారు. దీంతో పోలవరం, అల్లూరి & మన్యం జిల్లాలలో బంద్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గిరిజన ప్రాంతాల్లో తమ దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు & కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ గిరిజన హక్కు పరివేక్షణ దేయంగా ఈనెల 8వ తేదీన మన్యం బంద్ పాటించవలసినదిగా ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చారు. ఎందుకు గాను వాణిద్య, రవాణా, వ్యాపార సంస్థలు ఈ బందుకు సహకరించాలని సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు.


