Talliki Vandanam 2026 : తల్లికి వందనం రిలీజ్ డేట్ చేంజ్?.. అర్హత జాబితా.. ప్రభుత్వం తాజా ఉత్తర్వులు

Talliki Vandanam 2026 : తల్లికి వందనం రిలీజ్ డేట్ చేంజ్?.. అర్హత జాబితా.. ప్రభుత్వం తాజా ఉత్తర్వులు

AP Talliki Vandanam Scheme 2026 Release Date Change Latest News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం రిలీజ్ డేట్ చేంజ్ అయినట్టు సమాచారం.. ప్రభుత్వ స్కూళ్లలో ఈనెల 16, 17, 18 వ తేదీన నిర్వహించవలసిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఈ కారణంగా ఆ రోజులలో విడుదల చేయవలసిన తల్లికి వందనం నిధులు రిలీజ్ చేసి కూడా మారినట్లు సమాచారం. మెగా పేరెంట్స్ PTM తో సంబంధం లేకుండా మరో తేదీన విద్యార్థులు తల్లికి అకౌంట్లో డైరెక్ట్ గా 13000 చొప్పున జమ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నారు. తల్లికి వందనం ఎప్పుడు రిలీజ్ అనేది సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం రెండో విడుదల నిధులు విడుదలపై ఒక నిర్ణయం వచ్చినట్టు తెలుస్తుంది. తొలిత విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈనెల 16, 17, 18 తేదీన నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఆ రోజే మెగా పేరెంట్స్ మీటింగ్ ద్వారా డైరెక్ట్ గా తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తామని తెలిపారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ రోజులలో మెగా పేరెంట్స్ మీటింగ్ ని ఈనెల 22న వాయిదా పడినట్లు తెలుస్తుంది. అదే రోజున తల్లికి వందనం నిధులు కూడా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరంలో స్కూల్  ప్రారంభమైన జూన్ 12వ తేదీన పథకం అమలు చేశారు. ఈ సంవత్సరం వివిధ కారణాలవల్ల అమలలో ఆలస్యమైతూ వచ్చాయి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 68 లక్షల మంది విద్యార్థులను గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి 15000 ఆర్థిక సాయం అందుతుంది. అందులో 2000 పాఠశాల నిర్వహణ నిధికి వెళ్ళగా మిగిలిన 13000 నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్లో జమ కానున్నది. ఈనెల 22 లోపు నిధులు విడుదల అయ్యే అవకాశం ఉన్నాయి. అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు.

ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన పనులు చేయవలసి ఉంటుంది. అందులో విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ప్రభుత్వ పథకాలు రావాలంటే NPCI మ్యాపింగ్ కూడా పూర్తి చేసి ఉండాలి. అలాగే లబ్ధిదారులు తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ కి వెళ్లి ఈ కేవీసీ పూర్తి చేయాలి. అప్పుడే అర్హులైన అభ్యర్థులకు తల్లికి వందనం డైరెక్ట్ గా జమ అవుతుంది. అర్హులైన అభ్యర్థుల తుది జాబితా త్వరలో గ్రామ వార్డు సచివాలయ లో నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించనున్నారు. ఆలోపే బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్  e-KYC & NPCI పనులు కంప్లీట్ చేస్తే మీకు తల్లికి వందనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ గా మీ ఖాతాలోకి వస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *