Voter ID Card Download : మీ ఫోటోతో ఎలక్ట్రానికల్ ఓటర్ ID కార్డును e-EPIC డౌన్లోడ్ చేసుకోండి మొబైల్ ద్వారా
Voter ID Card e-EPIC Download Step by Step Process : ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కు సంబంధించి ఇప్పటికే చాలామందికి ఎన్యుమరేషన్ పత్రంలో పొందారు. ఫోటోతో ఓటరు గుర్తింపు ఎలక్ట్రానికల్కార్డు డౌన్‌లోడ్ ఆన్‌లైన్‌లో e-EPIC PDF ఎలా పొందాలి ఇప్పుడు తెలుసుకుందాం. భారత ఎన్నికల సంఘం ఇప్పుడు e-EPIC సులువుగా డిజిటల్ లో డౌన్లోడ్ చేసుకున్న అవకాశం కల్పించింది. అది కూడా ఫోటో పిడిఎఫ్ రూపంలో ఈజీగా పొందవచ్చు. e-EPIC అంటే (ఎలక్ట్రానికల్ ఎలక్ట్రోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) ఈ కార్డు పూర్తిగా డిజిటల్ రూపంలో ఓటర్ కార్డు గుర్తింపు లభిస్తుంది. ఇది మొబైల్ లో భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది, పిడిఎఫ్ రూపంలో వస్తుంది. ఓటర్ కార్డులో పేర్లు తప్పులు ఉన్న నమోదు అయినట్లయితే ఫార్మ్ నెంబర్ 18 మాత్రమే ఆన్లైన్ లో సమర్పించి తప్పులను సరి చేసుకోవచ్చు.

SIR Effect తో ఇప్పుడు ఇప్పుడు అందరికీ ఓటర్ ఐడి చాలా అవసరమైంది. ఇందుకుగాను e-EPIC ఎలక్ట్రానికల్ ఓటర్ ఐడిని మొబైల్ లోనే ఉంచుకోవడం చాలా అవసరం. అది కూడా చాలా సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://voters.eci.gov.in/ వెబ్సైట్ ద్వారా e-EPIC ఆప్షన్ ఎంచుకొని ఒక క్లిక్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా తమ మొబైల్ నెంబరు లాగిన్ అవ్వాలి. ఆ తరువాత eEPIC ఎంచుకోవాలి. అందులో EPIC నెంబరు స్టేట్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఎంటర్ చేసి e-EPIC ఎలక్ట్రానికల్ ఓటర్ కార్డును ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
e-EPIC ఓటర్ ఐడి కార్డు ఈజీగా మీ మొబైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం
•ముందుగా అభ్యర్థులు అధికార https://voters.eci.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
•ఆ తరువాత లాగ్ ఇన్ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి ఉపయోగించి లాగిన్ అవ్వండి. అందులో ధ్రువీకరణ కోసం ఓటిపి వస్తుంది ఎంటర్ చేసి నమోదు చేయండి.
• లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డు యాక్షన్ లో e-EPIC డౌన్లోడ్ ఎంపిక చేసుకోండి.
•అందులో EPICనెంబరు లేదా ఓటర్ నెంబర్ ను ఎంటర్ చేసి సర్చ్ పైన క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటిపి వెళ్తుంది. ఆ ఓటిపి ఎంటర్ చేసిన వెంటనే, e-EPIC ఓటర్ ఐడి పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. మరిన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి.


