తెలంగాణ పోలీస్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | Telangana Police SPO Driver Notification 2026
Telangana Police SPO Driver Recruitment 2026 : తెలంగాణ హైదరాబాదు సిటీ కమిషన్ రేట్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) లో డ్రైవర్ ఉద్యోగాల కోసం ఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారు నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ నోటిఫికేషన్ కి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుందని మాజీ పారామెడికల్ బలగాలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి & డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. దరఖాస్తు చేసుకోవాలనుకున్న మాజీ సైనికుల వయసు 31 జూలై 2026 నాటికి 58 సంవత్సరాలలోపు ఉండాలి. రిటైర్డ్ పోలీస్ అధికారులు రెండేళ్ల లోపు పదవి విరమణ చేసి ఉండాలి. ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయితే నెలకు 26,000 గౌరవ వేతనం లభిస్తుంది, అత్యవసర సెలవు దినాలు జీతం చెల్లించరు.
కావలసిన దృవీకరణ పత్రాలు : ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్స్ సర్వీస్ మెన్ డిశ్చార్జ్ బుక్, సీఎపీపీ డిశ్చార్జి సర్టిఫికెట్, ఆర్పీపీ రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు, టెక్నికల్ ట్రేడ్ ప్రొఫెషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కొత్తగా తీసుకున్న మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి : అభ్యర్థులు బంజారాహిల్స్ రోడ్డు నం-12లోని కార్యాల యంలో 12 జూలై నుంచి 19 జులై 2026 వరకు దరఖాస్తు సమర్పించాలి. సందేహాలుంటే 8712674111లో గోపాల్ రెడ్డి రిజర్వు ఇన్స్పెక్టర్ను సంప్రదించాలని సూచించారు.


