AP Anganwadi Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ | Andhra Pradesh Anganwadi Helper notification 2026 apply Now
Andhra Pradesh Anganwadi Helper Recruitment 2026 Application : అంగన్వాడి ఆయాల నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తరువాత 09-07-2026 తేది నుండి 17-07-2026 వరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సత్య సాయి జిల్లాలలో దరఖాస్తులను ఓబులదేవ చెరువు, పుట్టపర్తి మరియు నల్లచెరువు ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో 17-07-2026 వ తేది సాయంత్రము 5-00 PM వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. నిర్ణీత గడువు లోపల దరఖాస్తును సమర్పించి రసీదు పొందవలయును గడువు దాటిన పిమ్మట ఎటువంటి పరిస్థితులలోనూ దరఖాస్తులు స్వీకరించబడవు.
అంగన్వాడి కార్యకర్త. మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను. 01.07.2026 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటెషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ప్రాజెక్ట్ పేరు – మొత్తం AWH ఖాళీల సంఖ్య
•ఒబులాదేవచెరువు – 95
•నల్లచెరువు -1
•Puttaparthi-33
మొత్తం : 129

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.
•నేటివిటి సర్టిఫికేట్/రెసిడెన్స్/ఆధార్ మొదలగునవి…)
•పదవ తరగతి ఉత్తీర్ణత – మార్క్స్ మెమో
•పుట్టిన తేది & వయను నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో
•కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే) తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన
•వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును
•దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

