AP Government Jobs : రాత పరీక్షలు లేకుండా టెన్త్ అర్హతతో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ | AP APVVP Paramedical and Supporting Staff Recruitment 2026 Apply Now

AP Government Jobs : రాత పరీక్షలు లేకుండా టెన్త్ అర్హతతో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ | AP APVVP Paramedical and Supporting Staff Recruitment 2026 Apply Now

AP APVVP Paramedical and Supporting Staff Notification 2026 Apply Now: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (మాజీ APVVP) లో పారామెడికల్ మరియు సపోర్టింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. పూర్తిగా నింపిన దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30-06-2026 సాయంత్రం 5.00 గంటల వరకు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (మాజీ APVVP) ఆధీనంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఖాళీగా ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ & జనరల్ డ్యూటీ అటెండెంట్ / ఎం.ఎన్.ఓ./ ఎఫ్.ఎన్.ఓ ఉన్న పారామెడికల్ మరియు సపోర్టింగ్ సిబ్బంది పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ (థర్డ్ పార్టీ ఏజెన్సీ) ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. పోస్టుకు ప్రారంభ మూల వేతనం 15,000/- to రూ.32,670/- నెల జీతం ఇస్తారు. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తాం. వయసు 18-42 ఏళ్లు మధ్య ఉండాలి. విద్య అర్హత మెరిట్ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.  దరఖాస్తు నమూనా, విద్యార్హతలు, రిజర్వేషన్ వివరాలు, ఎంపిక విధానం, రోస్టర్ పాయింట్లు మరియు ఇతర పూర్తి వివరాలు జిల్లా అధికారిక వెబ్సైట్ https://konaseema.ap.gov.in లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు నమూనా అందుబాటులో ఉండే తేదీలు: 19-06-2026 ఉదయం 10.00 గంటల నుండి 30-06-2026 సాయంత్రం 5.00 గంటల వరకు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

AP APVVP Paramedical and Supporting StaffNotification 2026 Apply 19 Vacancy Overview :

సంస్థ పేరు ::ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (మాజీ APVVP) లో జాబ్స్
పోస్ట్ పేరు ::  ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ & జనరల్ డ్యూటీ అటెండెంట్ / ఎం.ఎన్.ఓ./ ఎఫ్.ఎన్.ఓ ఉద్యోగాల ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 19
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 42 సం||రాలు
విద్య అర్హత :: 10th, BSC(MLT), DMLT & డిప్లమా
నెల జీతం :: రూ.15,000/- to రూ.32,670/- –
దరఖాస్తు ప్రారంభం :: 19/06/2026
దరఖాస్తుచివరి తేదీ :: 30/06/2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
అధికార వెబ్సైట్ : https://konaseema.ap.gov.in/

»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ & జనరల్ డ్యూటీ అటెండెంట్ / ఎం.ఎన్.ఓ./ ఎఫ్.ఎన్.ఓ పోస్టులు భర్తీ. మొత్తం పోస్టులు 19 ఉన్నాయి.

»అవసరమైన విద్యా అర్హతలు :

•ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (VOC MLT) లేదా DMLT లేదా BSC(MLT) కలిగి ఉండాలి, ఒకవేళ ఇంటర్మీడియట్ (VOC) అయితే ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టుకు ఏపీ గుర్తించిన సంస్థ నుండి డార్క్ రూమ్ అసిస్టెంట్ శిక్షణలో డిప్లొమా సర్టిఫికేట్, (లేదా) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి రేడియోగ్రఫీ లేదా ఎక్స్-రే టెక్నాలజీ అనగా సి.ఆర్.ఎ. లేదా డి.ఎం.ఐ.టి. మొదలైన వాటిలో డిప్లొమా సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ & జనరల్ డ్యూటీ అటెండెంట్ / ఎం.ఎన్.ఓ./ ఎఫ్.ఎన్.ఓ పోస్టుకు SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

»నెల జీతం

•ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.32,670/-, డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.28,220/-, ఆఫీస్ సబార్డినేట్ & జనరల్ డ్యూటీ అటెండెంట్ / ఎం.ఎన్.ఓ./ ఎఫ్.ఎన్.ఓ పోస్టుకు రూ. 15,000/- వేలు వరకు జీతం ఇస్తారు.

»వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. మాజీ సైనికులకు: సాయుధ దళాలలో సేవా కాలానికి అదనంగా 03 (మూడు) సంవత్సరాలు. వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.

»దరఖాస్తు రుసుము: ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుమును సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నం. 036 5 1 2010000662, IFSC కోడ్. UBIN0803651, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోబెర్లిపేట, అమలాపురం బ్రాంచ్‌లో జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెల్లించాలి (అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హులైతే ప్రతి పోస్టుకు విడిగా చెల్లించాల్సి ఉంటుంది) క్రింద ఇవ్వబడిన విధంగా:

a) OC అభ్యర్థులకు…. రూ.350/- (మూడు వందల యాభై రూపాయలు మాత్రమే)

b) SC/ST/BC అభ్యర్థులకు…రూ.250/- (రెండు వందల యాభై రూపాయలు మాత్రమే)

c) శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులు = మినహాయింపు.

»ఎంపిక విధానం: అర్హత పరీక్షలో లేదా ఏదైనా ఇతర సమానమైన అర్హతలో అన్ని సంవత్సరాలలో పొందిన మార్కుల మొత్తానికి 75% కేటాయించబడుతుంది.  డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :: పై పోస్టుల కొరకు పూరించిన దరఖాస్తులను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఏరియా హాస్పిటల్, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త కార్యాలయంలో 30.06.2026 తేదీన సాయంత్రం 5.00 గంటలలోపు సమర్పించవలెను. దరఖాస్తు ఫారం మరియు ఇతర వివరాలను https://konaseema.ap.gov.in (జిల్లా వెబ్‌సైట్) లో పొందవచ్చు.

ముఖ్యమైన తేదీ వివరాల

దరఖాస్తులను ఆఫ్ లైన్ సమర్పించడానికి ప్రారంభ తేదీ: 19 జూన్ 2026

దరఖాస్తులను ఆఫ్ లైన్సమర్పించడానికి చివరి తేదీ :: 30 జూన్ 2026

🛑Notification Pdf Click Here 

🛑Application Pdf Click Here 

🛑Office Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *