Mee Seva Centres : కొత్త గా మీసేవ సెంటర్ పొందాలంటే ఇలా చేయండి
New Meeseva Centers Notification release all details in Telugu : మీ-సేవ కేంద్రాలు నెలకొల్పుటకు ఆసక్తి మరియు విద్యార్హతలు కలిగిన అభ్యర్ధుల నుండి నిర్ణీత సమయమునకు అనగా తేదీ: 20.09.2025 లోగా నిర్దేశించిన ఫారం లో సంబందిత రెవెన్యూ డివిజినల్ అధికారి గారి కార్యాలయములో సరైన దృవపత్రములయుక్తంగా, స్వయంగా సమర్పించుటకు కొరనైనది, ధరఖాస్తు చేయుటకు ఈ క్రింద పేర్కొన్న అర్హతలు కచ్చితంగా పాటించవలెను.

విద్య అర్హత : కనీస విద్యా అర్హతలు (డిగ్రీ మరియు ఆపై అర్హతలు). కంప్యూటర్ పరిజ్ఞానం & సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు : మీ-సేవ కేంద్రాలు నెలకొల్పుటకు అభ్యర్థి వయసు 21 సం. నుండి 44 సం.లలో ఉండవలెను.
ఎంపిక విధానము : దరఖాస్తు దారులకు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. కేంద్రాలను నిర్వహించుటకు సరైన పెట్టుబడి స్థోమత కలిగి ఉండవలెను. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డి.డి. రూ.500/- (Nonrefundable) తీసి ఫారం: వెంబడి జత చేయవలెను.
ఖాళీల వివరములు :
గండిపేట్ :04 (వట్టినాగులపల్లి, గండిపేట్, కిస్మత్పూర్ & గంధంగూడ)
మొయినాబాద్ : 03 (అజీజ్ నగర్. హిమాయత్ నగర్ & కనకమామిడి )
జిల్లెడ్ చౌదర్గూడెం : 02 ( తూంపల్లి & ఎదిర )
సరూర్నగర్ : 01 (తుమ్మబౌలి)
మంచాల్ : 01 (లోయపల్లి)
పైన పేర్కొన్న విధముగా సూచనలు పాటిస్తూ సంబందిత రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యలయం నుండి ధరఖాస్తు ఫారం ను పొంది, రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయము పని చేయు వేళలో అనగా ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సమర్పించవలెను.
ముఖ్యమైన తేదీ వివరాలు
ధరఖాస్తు స్వీకరించబడు ప్రారంభ తేదీ: 28.08.2025
ధరఖాస్తు స్వీకరించబడు చివరి తేదీ: 20.09.2025
ముఖ్య గమనిక : ఎన్నికైన అభ్యర్థి నేర చరిత్ర నిర్ధారణ అయినచో వారిని అనర్హులుగా పరిగణించబడతారు. వ్యక్తులను ఎన్నుకునేటప్పుడు సాధ్యమైనంతవరకు, పేద / వికలాంగ యువత మరియు సమాజంలోని ఇతర వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here