Nursing Jobs :జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు- నెలకు రూ.2.4-3.0 లక్షలు జీతం
Nursing Jobs in Germany 2025 All Details in Telugu Apply Now : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సీడాప్ – డిడియుజికెవై స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నర్సింగ్ అభ్యర్థులకు ఓ గోల్డెన్ ఛాన్స్! జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేకంగా జర్మన్ భాష శిక్షణ తరగతులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జర్మనీలో రూపాయి 2.4 లక్షల నుంచి 3.0 లక్షల వరకు నెల జీతంతో ఉద్యోగం పొందవచ్చు

అర్హతలు:
• విద్యార్హత:B.Sc నర్సింగ్ లేదా GNM (General Nursing & Midwifery) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
• వయోపరిమితి:20 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
• అనుభవం: సాధారణ ఆసుపత్రులలో పని చేసిన అనుభవం ఉండాలి.
• జర్మన్ భాషా పరిజ్ఞానం: జర్మన్ భాష నేర్చుకోవడంపై ఆసక్తి కలిగి ఉండాలి. అభ్యర్థులు B2 స్థాయి వరకు జర్మన్ భాషను అభ్యసించాల్సి ఉంటుంది.
🔥Thalliki Vandanam Scheme : తల్లికి వందనం అర్హత వీరికే… మార్గదర్శకాలు
శిక్షణ మరియు సౌకర్యాలు:
• 6 నుండి 9 నెలల పాటు ఉచిత శిక్షణ
• ఉచిత భోజన వసతి
• B2 స్థాయికి చేరుకునే వరకు పూర్తి సహాయం
• విమాన ఛార్జీలు ఉచితం
జీతం & ప్రయోజనాలు:
• జర్మనీలో నర్సింగ్ ఉద్యోగం పొందినవారికి రూ.2.4 లక్షల నుండి 3.0 లక్షల వరకు నెల జీతం
• జర్మనీలో మంచి ఆసుపత్రులు & ఆరోగ్య సంస్థలలో ఉద్యోగం పొందే అవకాశం
• వృత్తిపరంగా మెరుగుపడి, అంతర్జాతీయ స్థాయిలో నర్సింగ్ అనుభవం పొందే అవకాశం
ఎక్కడ & ఎప్పుడు శిక్షణ ప్రారంభం?
• శిక్షణ తరగతులు విజయవాడ, భవానీపురం లోని సీడాప్ డిడియుజికెవై స్కిల్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ప్రారంభం కానున్నాయి.
• తేదీ: ఈ నెల 24వ తేదీ నుండి తరగతులు మొదలవుతాయి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
☎ 9963074879
☎ 9492719843
☎ 7288873337
ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోండి! జర్మనీలో నర్సింగ్ ఉద్యోగం పొందాలనుకునే వారు వెంటనే సంప్రదించండి.

🛑Notification Pdf Click Here