Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం ఎప్పుడంటే
Talliki Vandanam Scheme Full Details Telugu
తల్లికి వందనం పథకం : ఆంధ్రప్రదేశ్ CM చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకంపై మరోసారి గూడూరు నెల్లూరులో జరిగిన సమావేశం స్పష్టత చేశారు. ఈ పథకం క్రింద, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా, ప్రతి పిల్లవాడికి మే నెలలో రూ. 15,000 ఇస్తామని తెలియజేశారు. పిల్లల ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ఆయన చంద్రబాబు నాయుడు ప్రసంగంలో తెలియచేశారు.

అదే సమావేశంలో, రైతులకు మరియు మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం మరొకసారి తెలియజేశారు. ప్రతి రైతుకు రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేస్తామని, అలాగే మత్స్యకార కుటుంబాలకు కూడా రూ. 20,000 చొప్పున అందించబడుతుందని ఆయన తెలిపారు. ఈ సహాయం వల్ల రైతులు మరియు మత్స్యకారులు ఆర్థికంగా సహాయపడుతుందని తెలియజేశారు.

అలాగే, జూన్ నెలలోపు DSC ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో, ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనల ద్వారా ప్రభుత్వం ప్రజల భలాన్ని మరింతగా పెంచుతోందని చెప్పవచ్చు.