AP Model Schools 6th Class Admissions 2025 : ఆదర్శ పాఠశాలలో నోటిఫికేషన్
AP Model Schools 6th Class Admissions 2025 : ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2025-26 విద్యా సంవత్సరములో 6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2025-2026 విద్యా సంవత్సరమునకు 6వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 20.04.2025 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాల ముందే 20.04.2025 మార్నింగ్ 10:00 గంటల నుండి 12:00 గంటల ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు/ ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

ప్రవేశ అర్హతలు:
1) వయస్సు:ఒ.సి, బి.సి. (OC, BC) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2013 to 31-08-2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2011- 31-08-2015 మధ్య పుట్టి ఉండాలి.
2) సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2023-24 మరియు 2024-25 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
3) దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రము కొరకు www.cse.ap.gov.in or www.apms.acfss.in చూడగలరు.
దరఖాస్తు చేయు విధానము: అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది.-2025 నుండి 2025 net banking/credit/debit card ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్నెట్ www.cse.ap.gov.in/ www.apcfss.in (Online) చేసుకోవలెను.
4) పరీక్షా రుసుము : OC మరియు BC లకు రూ. 150/-(అక్షరాల 150/- రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ.75/- (అక్షరాల 75/- రూ. మాత్రమే)
5) 6వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షలో OC మరియు BC విద్యార్థులు 35 మార్కులు. SC మరియు ST విద్యార్థులు కనీసం 30 మార్కులు పొందియుండవలెను.
6) ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.

7) ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము Objective Type లో వుండును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.
🛑నోటిఫికేషన్ Pdf Click Here