AP Jobs : రాత పరీక్ష లేకుండా మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ కోసం దరఖాస్తు ఆహ్వానం | AP Ministers Office  Outsourcing Jobs Notification 2024 Apply Now | Telugu Jobs Point

AP Jobs : రాత పరీక్ష లేకుండా మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ కోసం దరఖాస్తు ఆహ్వానం | AP Ministers Office  Outsourcing Jobs Notification 2024 Apply Now | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Ministers Department Outsourcing Jobs 2024 in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. వయసు 40 సంవత్సరాల లోపు.. నెల జీతం 30 వేల నుంచి 50 వేల మధ్యలో రాత పరీక్ష లేకుండా వెంటనే ఉద్యోగం కావాలన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో మంత్రుల పేషీలలో తాత్కాలిక ప్రాతిపదికన సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రతీ మంత్రి పేషీలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ నియమించబడతారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా సమర్థంగా ప్రచారం చేయడం లక్ష్యంగా ఉంది.

ఆర్గనైజేషన్ పేరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ

ఖాళీలు వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు:
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌ – ఒక్కో మంత్రి పేషీలో ఒకరు
సోషల్ మీడియా అసిస్టెంట్‌ – ఒక్కో మంత్రి పేషీలో ఒకరు

అర్హతలు
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ మరియు అసిస్టెంట్స్‌కు విద్యార్హతలు మరియు ఇతర అర్హతలు క్రింది విధంగా ఉన్నాయి:

సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌ : బీఈ/బీటెక్ లేదా సమానమైన కోర్సు సంబంధిత అనుభవం కలిగి ఉండాలి.
సోషల్ మీడియా అసిస్టెంట్‌ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ
సోషల్ మీడియా వినియోగంపై అవగాహన

వయోపరిమితి
ఈ పోస్టుల కోసం అభ్యర్థుల వయోపరిమితి:
కనీస వయసు : 21 సంవత్సరాలు to గరిష్ఠ వయసు : 40 సంవత్సరాలు

దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు : విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు లేదా గుర్తింపు పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు సంబంధిత అనుభవ సర్టిఫికేట్లు, నివాస ధ్రువీకరణ పత్రం & దరఖాస్తు విధానం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో అవసరమైన వివరాలను పూర్తి చేసి, సంబంధిత డాక్యుమెంట్‌లను జతచేయాలి.

ఎంపిక ప్రక్రియ : అభ్యర్థుల ఎంపిక కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం, సామాజిక మాధ్యమాలపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరిశీలిస్తారు ఎంపిక చేయడం జరుగుతుంది.

జీతభత్యాలు

• సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌: నెలకు రూ.50,000
• సోషల్ మీడియా అసిస్టెంట్‌: నెలకు రూ.30,000

మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది చెక్ చేయండి అర్హులు మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఇది షేర్ చేయండి.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page