AP Residence Certificate : మళ్లీ రెసిడెన్సి సర్టిఫికెట్ జారీ… ప్రభుత్వం కీలక ప్రకటన
AP Residence Certificate Rule Change Tahsildars Regain Issuing Authority : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు, ఉద్యోగులు & ఓటు నమోదుకు రెసిడెన్సి సర్టిఫికెట్ కీలకంగా మారాయి. దీంతో వాటిని జారీ చేసే అధికారం మళ్లీ MRO పునరుద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెసిడెన్సి సర్టిఫికెట్ కోసం స్థానిక MRO కి దరఖాస్తు చేసుకోవాలి. MRO గారు ఎలాంటివి డాక్యుమెంట్ అవసరం లేకుండా స్థానికంగా విచారించి సర్టిఫికెట్ అందజేస్తారని పేర్కొన్నారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, నివాస రుజువులుగా అనుమతిస్తూ రెసిడెన్సి సర్టిఫికెట్ జారీ చేసేందుకు ప్రభుత్వం 2015లో నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ రెసిడెన్సి సర్టిఫికెట్ జారీ చేసే అధికారం MRO గారికి ఇవ్వడం జరిగింది.

ఏపీ రాష్ట్రంలో నివాస ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ పాత విధానాన్ని రెసిడెన్సి సర్టిఫికెట్ను జారీ చేసే అధికారం తాసిల్దార్ కు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకపోయినా తాసిల్దారు స్థానికంగా విచారం చేసి నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని సిఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఓటర్ జాబితాలో పేరు నమోదుకు స్థానికంగా గుర్తింపు అవసరమవడంతో ప్రజలు మళ్ళీ నివాస ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని కోరుకున్నారు దీనితో ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 20 జూన్ 2015 ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ మళ్ళీ పాత విధానాన్ని తాసిల్దార్ ద్వారా నివాసం దొరికిన పత్రం జారీచేయాలని పునరుద్ధరించింది.


