TTD Vacancy : అత్యవసర ఉద్యోగ భర్తీ.. 10వ తరగతి అర్హతతో మాజీ సైనికులకు తితిదేలో ఉద్యోగాలకు 9న ఎంపికలు

TTD Vacancy : అత్యవసర ఉద్యోగ భర్తీ.. 10వ తరగతి అర్హతతో మాజీ సైనికులకు తితిదేలో ఉద్యోగాలకు 9న ఎంపికలు

TTD Security Executives at Tirumala Tirupati Dev Sthan for Ex-servicemen Vacancy : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మాజీ సైనికుల కోసం సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత, ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

ఆంధ్రప్రదేశ్ లో మాజీ సైనికులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తూ జిల్లా ఇన్చార్జి సైనిక్ సంక్షేమ అధికారి వై ఈశ్వర రావు గారు తెలిపారు. ఇందులో ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్(సికింద్రాబాద్), ఏపీ సైనిక్ సంక్షేమ శాఖ సహకారంతో గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మాజీ సైనికుల కోసం ఈ ఎంపిక ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రక్రియ ఈనెల తొమ్మిదో తేదీన ఉదయం 6 గంటల నుంచి మొగల్రాజపు రంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రారంభమవుతాయని వివరించారు. ఎంపికైన విధుల్లో చేరే సమయానికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలు లోపు మించి ఉండరాదని పేర్కొన్నారు అర్హత కలిగిన మాజీ సైనికులు స్పోర్ట్స్ రన్నింగ్ షూస్ తో ఎంపిక ప్రక్రియ హాజరుకావాలని సూచించారు.

అర్హత మరియు ఆసక్తి ఉన్న మాజీ సైనికులు ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మాజీ సైనికుని ఐడి కార్డు, డిశ్చార్జ్ బుక్, పదో తరగతి మార్క్ షీట్, బ్యాంకు పాస్ బుక్ & 8 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ తో ఎంపిక సమయంలో హాజరవ్వాలని తెలిపారు. అలాగే అన్ని ధృవీకరణ పత్రాలు రెండు సెట్లు జిరాక్స్ కాపీలు కూడా వెంట తీసుకురావాలని సూచించారు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 24,743 వేతనంతో పాటు ఉచిత వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *