జిల్లాలో కొత్త గా మీ సేవ కేంద్రం ఏర్పాటు చేసుకునే అవకాశం.. అక్టోబర్ 29 చివరి తేదీ | New Meeseva Center 2026 Application Pdf
Nagarkurnool Meeseva Center 2026 Application : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో మీ సేవ కేంద్రం ఏర్పాటు చేయాలనుకునే అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో మీ సేవ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు అవసరమైన ధ్రువపత్రాలతో 2026 అక్టోబర్ 29వ తేదీలోగా సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి.

మీ సేవ కేంద్రం దరఖాస్తు వివరాలు
• జిల్లా : నాగర్‌కర్నూల్
• మండలం : వంగూరు
• కేంద్రం ఏర్పాటు చేయాల్సిన గ్రామం : కొండారెడ్డిపల్లి
• కనీస విద్యార్హత : డిగ్రీ లేదా సమాన అర్హత
• వయస్సు : 21 నుంచి 44 సంవత్సరాలు
• కంప్యూటర్ అర్హత : కంప్యూటర్ సర్టిఫికేషన్ కోర్సు
• దరఖాస్తు చివరి తేదీ : 29 అక్టోబర్ 2026
• దరఖాస్తు సమర్పించే స్థలం : సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయం
• దరఖాస్తు ఫీజు : రూ.500 డీడీ
• ఎంపిక విధానం : రాత పరీక్ష, మౌఖిక పరీక్ష
అర్హతలు ఏమిటి : మీ సేవ కేంద్రం ఏర్పాటు చేయాలనుకునే అభ్యర్థి సంబంధిత మండలానికి చెందిన స్థానికుడై ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హతతో పాటు కంప్యూటర్ సర్టిఫికేషన్ కోర్సు కలిగి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థికి మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు చెందిన సభ్యులు ఈ దరఖాస్తుకు అనర్హులని ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థులకు మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నల రాత పరీక్షకు 70 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 70 నిమిషాలు. మౌఖిక పరీక్షకు 30 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష, ఇతర ఎంపిక ప్రమాణాల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి : అభ్యర్థులు నాగర్‌కర్నూల్ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్: దరఖాస్తును పూర్తిగా నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేయాలి. అలాగే “COLLECTOR AND CHAIRMAN DISTRICT e-GOVERNANCE SOCIETY” పేరుతో రూ.500 డీడీ తీసి దరఖాస్తుతో పాటు సమర్పించాలి. దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో పని వేళల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సమర్పించాలి. చివరి తేదీ 2026 అక్టోబర్ 29, గురువారం.
దరఖాస్తు సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాలు, డీడీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించండి. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మీ సేవ కేంద్రం ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానం. డిగ్రీ అర్హత, వయస్సు 21- 44 ఏళ్లు. చివరి తేదీ అక్టోబర్ 29, 2026.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

