కొత్తగా అంగన్వాడీలో రాత పరీక్ష లేకుండా జాబ్ | ICDS Anganwadi Helper Notification 2026 Apply Now
ICDS Anganwadi Helper Notification 2026 Apply Now :తెలంగాణ ప్రభుత్వము, మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ లో ఐసిడిఎస్ ప్రాజెక్టులలో అంగన్‌వాడీ ఉపాధ్యాయులు (AWTలు) మరియు అంగన్‌వాడీ సహాయకుల (AWHలు) ఖాళీలను సమీక్షించి, నోటిఫికేషన్ కోసం గుర్తించడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను 29.10.2026 మద్యాహ్నం 12:00 గంటలలోగా CDPO, ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి.

అభ్యర్థుల అర్హతలు
•దివ్యాంగుల అర్హతలు: SADARAM సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విద్యార్హత:
(a) అంగన్వాడీ టీచర్ (AWT) మరియు అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులకు ఇంటర్మీడియట్ /12వ తరగతి ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా ఉండాలి.
(b) అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు ఇంటర్మీడియట్ / 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థి అందుబాటులో లేని పక్షంలో, తదుపరి కనీస విద్యార్హత అయిన ఎస్ఎస్సి (10వ తరగతి) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థిని ఎంపికకు పరిగణించవచ్చు.
(c) అంగన్వాడీ టీచర్ (AWT) మరియు అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 01.07.2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది సక్షమ్ అంగన్వాడీ & పోషణ్ 2.0 మార్గదర్శకాల ప్రకారం అమలులో ఉంటుంది.
•రాష్ట్ర అర్హత: తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
•స్థానికత: అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, అభ్యర్థి స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతంలో అయితే సంబంధిత వార్డు నివాసి, గ్రామీణ ప్రాంతంలో అయితే అంగన్ వాడీ కేంద్రం ఉన్న గ్రామపంచాయితీ నివాసి అయి ఉండాలి.
•ఎంపిక విధానం: ఎస్సీ/ఎస్టి సబ్ ప్లాన్ ప్రకారం ఎస్టి (హ్యామ్లెట్/ హ్యాబిటేషన్) కోసం కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, అదే ఆవాసం (హ్యామ్ లెట్/ హ్యాబిటేషన్)కు చెందిన ఎస్ఐ మహిళా అభ్యర్థి మాత్రమే అర్హురాలు.
ఎస్సీ/ఎస్టి సబ్ ప్లాన్ ప్రకారం ఎస్సి ఆవాసం కోసం కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, అదే గ్రామపంచాయతీకి చెందిన ఎస్సి మహిళా అభ్యర్ధి మాత్రమే అర్హురాలు.
సమర్పించవలసిన పత్రాలు (స్కాన్ చేసిన కాపీలు)
1. పుట్టిన తేదీ ధృవీకరణ – పుట్టిన తేదీ పత్రం / SSC మెమో.
2. కుల ధృవీకరణ – MeeSeva ద్వారా జారీ చేయబడిన పత్రం.
3. విద్యార్హత ధృవీకరణ – Intermediate మార్కుల జాబితా.
4. నివాస ధృవీకరణ – MeeSeva ద్వారా జారీ చేయబడిన పత్రం.
5. దివ్యాంగుల ధృవీకరణ – SADARAM Certificate తప్పనిసరి.
6. ఫోటో మరియు సంతకం- స్పష్టంగా ఉండాలి.
7. ఆధార్ కార్డు.
ముఖ్య సూచనలు
•దరఖాస్తు చేసుకోవలసిన వెబ్సైట్ https: //wdcw.tg.nic.in/
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 19-10-2026
•దరఖాస్తుల చివరి తేది : 28-10-2026 సాయంత్రం 05:00 గంటల వరకు
•చివరి తేదీ తర్వాత సమర్పించిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు.
•ఆన్లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను 29.10.2026 మద్యాహ్నం 12:00 గంటలలోగా CDPO, ICDS జైనథ్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి. అర్హత కలిగిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here

