Free Aadhaar Card : ఏపీ ప్రజలకు అలర్ట్.. ఏపీలో స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఆ సేవలు పూర్తిగా ఉచితం..
Free Special Aadhaar service camps in Andhra Pradesh from 11th August 2026 Latest News : విద్యార్థులకు భారీ శుభవార్త.. నూతనంగా ఆధార్ నమోదు, ప్రస్తుత ఆధార్ కార్డుల పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబరు & బయోమెట్రిక్ చేసుకోవడానికి ఈనెల 11 నుంచి ప్రత్యేక ఆధార్ సేవ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
•AP విద్యార్థులకు మరొక సువర్ణ అవకాశం
•ఆధార్ అప్డేట్ చేసేందుకు స్పెషల్ సెంటర్లు
•ఆధార్ బయోమెట్రిక్ కోసం 11 నుంచి ప్రత్యేక ఆధార్ సేవ శిబిరాలు

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 11 నుంచి 14 వరకు అలాగే 17 నుంచి 20 వరకు జిల్లాలలో ప్రత్యేక ఆధార శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మిశ గారు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. వివిధ జిల్లాలలో ఎంపిక చేసిన స్వర్ణ, గ్రామ వార్డు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలు ప్రత్యేక ఆధార్ సేవ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్లు, 15 ఏళ్ల పై పడిన విద్యార్థులకు కొత్తగా ఆధార్ నమోదు, ప్రస్తుతం ఆధార్ లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, బయోమెట్రిక్ వివరాలు సవరణ కోసం, అలాగే పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
విద్యార్థులు ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాలి. అలాగే కొత్తగా నమోదు చేసుకోవాలని అభ్యర్థులు తమ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు తీసుకుని వెళ్లాలి. ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే అభ్యర్థి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్లాలి. ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కదానికి కూడా అనుసంధానమై ఉంటుంది, కాబట్టి విద్యార్థుల వేలిముద్ర బయోమెట్రిక్ కూడా చేపించండి. విద్యార్థులకు ఐదేళ్ల తర్వాత ఒకసారి, 15 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఒక రెండోసారి ఆధార్ అప్డేట్ చేయొచ్చు. మీసేవ చుట్టూ తిరగనవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం స్కూల్, కళాశాల లేదా స్వర్ణ గ్రామ/వార్డు కార్యాలయాలు ప్రత్యేక ఆధార్ సేవ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి.


