AP Digi Rythu Bazar : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్.. రైతు బజార్ నుంచి..ఇంటి వద్దకే నాణ్యమైన కూరగాయలు.. ఫ్రీ డెలివరీ

AP Digi Rythu Bazar : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్.. రైతు బజార్ నుంచి..ఇంటి వద్దకే నాణ్యమైన కూరగాయలు.. ఫ్రీ డెలివరీ

AP Digi Rythu Bazar Quality vegetables home delivery in Andhra Pradesh government 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో రైతు బజార్ ధరలకే వినియోగదారులకు ఇంటి వద్దకే నాణ్యమైన కూరగాయలు.. డిజి రైతు బజార్ సేవలు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ లో రైతు బజార్ ధరలకు వినియోగదారులకు ఇంటి వద్దకే కూరగాయలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజి రైతు బజార్ సేవలు ప్రారంభించింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తిరుపతి నగరాలలో ఆర్డర్స్ వచ్చాయి. విశాఖ, విజయవాడ ప్రతి స్టాల్ నుంచి 150 ఆర్డర్స్, అలాగే తిరుపతి,  గుంటూరులలో 50 పైగా ఆర్డర్స్ వచ్చాయని తెలిపారు. రైతు బజారు నుంచి నాణ్యమైన కూరగాయలు సేకరించి డబుల్ గ్రేడింగ్ చేసి వినియోగదారులకు అందచేస్తున్నారు. దీని ద్వారా దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు కూరగాయలు అందించేందుకు మ్యాచింట్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీతో కలిసి పీపీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు గిట్టుబాటు ధరలు కలిగించేందుకే.. వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజీ రైతు బజార్ అనే కొత్త యాప్ తీసుకొచ్చింది. రైతులు తమ పండించిన పంటలు దళారుల చేతులు మారకుండా రైతు నుంచి డైరెక్ట్ గా వినియోగదారులకు విక్రయించే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా రైతులకు మంచి ధర కలుగుతుంది, అలానే వినియోగదారులకు కూడా చౌక ధరలు నాణ్యమైన కూరగాయలు అందుతాయి.

ఆంధ్రప్రదేశ్ లో ముందుగా వినియోగదారులు తమ మొబైల్ లో ఉన్న Play Store నుంచి Digi Rythu Bazaar AP App డౌన్లోడ్ చేయండి. లేదా https://digirythubazaarap.com/ వెబ్సైట్ నుంచి కూరగాయలను ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాలకూ ఈ సేవలను విస్తరించనున్నారు. ఇందులో మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ తో పేరు పాటు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ అడ్రస్ వివరాలు ఎంటర్ చేసి, బ్యాంకు, UPI ద్వారా పేమెంట్ చేయొచ్చు. కొన్ని నిమిషాలలోనే రైతు బజార్ నుంచి మీకు చౌకైన కూరగాయలు డోర్ డెలివరీ వస్తాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *