విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఉచితంగా ఒక్కొక్కరికి రూ.15 వేలు నుంచి రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం, మళ్లీ కట్టక్కర్లేదు.. SBI Asha Scholarship 2026
SBI Asha Scholarship 2026 : SBI ఆశా స్కాలర్షిప్ ద్వారా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ పీజీ, ఐఐటి, ఐఐఎం & వైద్య విద్య చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా 15వేల నుంచి 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్లాటినం జూబ్లీ ఆశ స్కాలర్షిప్-2026కు ద్వారా అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడానికి మైనారిటీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు గారు ఎండీ.యాకూబ్ పాషా శుక్రవారం ప్రకటన చేశారు. ఈ స్కాలర్షిప్ ద్వారా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు 15,000/-, డిగ్రీ విద్యార్థులకు ₹75,000/-, PG విద్యార్థులకు రూ. 1,50,000/- ఐఐటీ విద్యార్థులకు రూ 2,00,000/-, IIM విద్యార్థులకు రూ, 5,00,000/-, వైద్య విద్యార్థులకు 2,00,000/- & విదేశాల్లో ఉన్న విద్య అభ్యాసం చేస్తున్న అభ్యర్థులకు ఏడాదికి 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
ఆశ స్కాలర్షిప్ 2026కు గత విద్య సంవత్సరంలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన కుటుంబ వార్షిక పాఠశాల విద్యార్థులకు 3 లక్షల లోపు కాలేజీ విద్యార్థులకు 6 లక్షల లోపు ఉన్నవారు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. అర్హత మరియు ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, ఫీజు చెల్లించిన రసీదు & ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్ తో 04 సెప్టెంబర్ లోపు https://www.sbiashascholarship.co.in/ వెబ్సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ అవకాశాన్ని అన్ని వర్గాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా శుక్రవారం ప్రకటన చేశారు. మరిన్ని వివరాల కోసం 8520860785 మొబైల్ నెంబర్ ని కోరారు. ఈ స్కాలర్షిప్ కి రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


