Talliki Vandanam Scheme : పేరెంట్స్ అలర్ట్.. తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కీలక అప్డేట్
Talliki Vandanam Scheme 2026 Release Date : తల్లికి వందనం డబ్బులు విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. జూలై 16,17, 18వ తేదీలలో పేరెంట్స్ మెగా మీటింగ్ (PTM) వాయిదా పడుతూ జూలై 22 తేదీ మార్చారు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

తల్లికి వందనం అర్హత జాబితా గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రదర్శననున్నారు. అందులో తమ పేరు ఉందో లేదో నేరుగా తెలుసుకోవచ్చు. లేదా ఆధార్ నెంబర్ ద్వారా ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పేరెంట్స్ కి అలర్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ కు బ్యాంకు అకౌంటు లింక్ ఉందా! లేదా? ఈ-కేవైసీ అయ్యిందా లేదా? NPCI మ్యాపింగ్ అయిందా లేదా తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఈటీవీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా నిధులకు విడుదల ఆమోదం లభించింది. ఈ సంవత్సరం సుమారుగా 68 లక్షల మందికి లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని అంచనా. కుటుంబంలో ఎంత మంది పిల్లలు బడికి వెళితే అంతమందికి విడివిడిగా 15,000 ఆర్థిక సహాయం అందజేయనున్నారు. అందులో 2,000 స్కూల్ నిర్మాణానికి యూస్ అవుతుంది. మిగిలిన 13,000 డైరెక్టుగా తల్లుల అకౌంట్లో జమ కానున్నది. అలా జమ కాని పక్షంలో ఏ పిల్లవానికైతే మనీ రాకపోతే వెంటనే సచివాలయ లో వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించండి. తల్లికి వందనం పథకం లబ్ధి పొందాలనుకున్న విద్యార్థులకు కనీసం 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి. గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలో చదివే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. పేద విద్యార్థులకు మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలో టిటిడి కార్యకర్తలు సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ తల్లికి వందనం రెండో విడుదల నిధులు జూలై 16,17, 18 వ తేదీలలో లబ్ధిదారి ఖాతాలను జమ చేస్తామని ఆయన ప్రకటించారు. కానీ తాజాగా విద్యాశాఖ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 22న నిర్వహించాలని ప్రకటన చేశారు. మరిన్ని వివరాలు రేపు స్కూల్ ఓపెన్ అయితే తెలుస్తాయి. ఇంకా టైం ఉంది కాబట్టి తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా తప్పనిసరిగా చెక్ చేసుకోండి, అలాగే బ్యాంకు అకౌంట్ కి ఈ కెవిసి అనేది కూడా తప్పనిసరిగా అయి ఉండాలి. బ్యాంక్ తో NPCI మ్యాపింగ్ యాక్టివ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు తల్లికి వందనం అమౌంట్ అనేది పడుతుంది.

