AP DCHS సాంఘిక సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్ కొత్త నోటిఫికేషన్ | AP DCHS Requirement 2026 Apply Now
AP DCHS Notification 2026 Apply Now : జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి (DCHS), భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా వారి పరిధి లో గల జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులలో ఖాళీ గా వున్న పారామెడికల్ మరియు సహాయక సిబ్బంది పోస్టులకు వివిధ కేటగిరిలలో అనగా ల్యాబ్ టెక్నిషియన్, ఎలక్ట్రిషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ధియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటి అటెండెంట్ /MNO /FNO, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులకు కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్ (థర్డ్ పార్టీ ఏజెన్సీ) పద్ధతి లో డిస్ట్రిక్ట్ సెలెక్టన్ కమిటీ ద్వారా భర్తీ చేయుటకు గాను దరఖాస్తులు కోరడ మైనది.

ఆసక్తి గల అభ్యర్ధులు ఖాళీలు మరియు పూర్తి వివరముల కొరకు www.westgodavari.nic ను సందర్శించ గలరు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి (DCHS) కార్యాలయం, కలెక్టర్ ఆఫీసు క్యాంపస్, భీమవరం నందు 22.06.2026 నుండి 06.07.2026 లోపు (ఆఫీసు వర్కింగ్ డేస్ లలో) ఉదయం 10.30 నుండి సాయంత్రం 05.00 గంటల లోపు సమర్పించ గలరు.
పోస్ట్ వివరాలు :
•జనరల్ డ్యూటీ అటెండర్ : 12
•థియేటర్ అసిస్టెంట్ : 01
•ల్యాబ్ అటెండెంట్ : 01
• పోస్ట్ మార్టం అసిస్టెంట్ : 01
•DRA : 10
•ల్యాబ్ టెక్నీషియన్ Gr-II : 01
•ఎలక్ట్రీషియన్ : 01

గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా DMLT లేదా BSC(MLT) దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు: గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. ఓసీ అభ్యర్థులకు రూ.350/-(మూడు వందల యాభై రూపాయలు మాత్రమే). ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు – రూ.250/-(రెండు వందల యాభై రూపాయలు మాత్రమే), శారీరకంగా సవాలు చేయబడిన అభ్యర్థులు-మినహాయింపు. పై పోస్టుల కోసం పూరించిన దరఖాస్తులను 06.07.2026 తేదీన సాయంత్రం 5.00 గంటలలోపు భీమవరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆసుపత్రి సేవల జిల్లా సమన్వయకర్త కార్యాలయంలో సమర్పించవలెను. దరఖాస్తు ఫారం మరియు ఇతర వివరాలను http://westgodavari.nic.in (జిల్లా వెబ్సైట్) లో పొందవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•దరఖాస్తులను సమర్పించడానికి ప్రారంభం తేదీ : 22-06-2026
•దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ: 06-07-2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

