AP EAPCET 2026 Results : విద్యార్థులకు కీలక అప్డేట్.. ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ఎప్పుడంటే?

AP EAPCET 2026 Results : విద్యార్థులకు కీలక అప్డేట్.. ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ఎప్పుడంటే?

AP EAPCET Results 2026 Release Date Final Update : ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్, ఇంజనీర్ & ఫార్మా కోర్సుల ప్రవేశ సంబంధించి ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 30 లోగా విడుదల కానున్నాయి. 2026-27 సంవత్సరానికి సంబంధించి 3.29 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు ఈనెల ఆఖరిలో ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు JNTUK వైస్ చైర్మన్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు వెల్లడించారు. ఇంటర్ CBSE రిజల్ట్స్ 85% నిన్న విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా ఎంసెట్ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ద్వితీయ సంవత్సరం ఇంక్రిమెంట్ రాసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం కల్పించింది. రిజల్ట్స్ ఈనెల 18 విడుదలైనప్పటికీ, సీబీఎస్సీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. CBSE లో బోర్డులో సాంకేతిక లోపం వల్ల ఫలితాలు విడుదలలో ఆలస్యం జరిగింది.

ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటనకు ఆలస్యానికి ప్రధాన కారణం ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజీ ప్రక్రియ. ప్రస్తుతం సీబీఎస్సీ విద్యార్థుల వెరిఫికేషన్ రి వెరిఫికేషన్ ప్రక్రియ తుది దశలో ఉంది. జూన్ 21 నాటికి 85% పైగా ఫలితాలు సీబీఎస్ఈ ప్రకటించి మిగిలిన ఫలితాలు దశలవారీగా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. ఈ సంవత్సరం దాదాపుగా 8,000 మంది సిబిఎస్ విద్యార్థులు ఎంసెట్ పరీక్షలు హాజరయ్యారు. ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు సూచించడంతో ఎంసెట్ చైర్మన్ గారు తెలిపారు. ఈ సంవత్సరం ఫలితాలు ఆలస్యమైన ఏ ఒక్క విద్యార్థి ర్యాంకులపై
ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్త వహిస్తున్నట్లు తెలిపారు. 

ఈఏపీసెట్ ఫలితాలు ఫలితాలు వాస్తవంగా జూన్ ఒకటో తేదీన విడుదల కావాల్సింది అయితే ఏపీ ఈఏపీసెట్ లో ఇంటర్ మార్క్స్ 25 శాతం వెయిటేజ్ ఉండడంతో ర్యాంకు కేటాయింపుకు ఇంటర్ బోర్డు తప్పనిసరి అవ్వాల్సి వచ్చింది. రాష్ట్రంలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంక్రిమెంట్ పరీక్షలు రాసి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడంతో అనేకమంది విద్యార్థులు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు హాజరయ్యారు. ఈ మార్క్స్ కూడా ర్యాంకింగ్ లో పరిగణలోకి రావాల్సి ఉండడంతో ఫలితాలు విడుదలలు ఆలస్యం అయ్యింది. ఈ సంవత్సరం మే 12 నుంచి మే 20 వరకు ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 3.29 లక్షల మంది పైగా విద్యార్థులు పరీక్ష హాజరయ్యారు.

ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 30లోగా విడుదల కానున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/ విజిట్ చేస్తూ ఉండండి.

🛑AP EAPCET Results 2026 Website 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *