IB Jobs : కొత్త గా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Intelligence Bureau Junior Intelligence Officer Grade II Recruitment 2025 all details in Telugu apply online now
Intelligence Bureau Junior Intelligence Officer Grade II job notification 2025 Apply for 394 Vacancies : ఇంటెలిజెన్స్ బ్యూరో (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ) భారత ప్రభుత్వం జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్ ఎక్సామినేటివ్-2025 కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. IB నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14.09.2025 (2359 గంటలు) లోపల www.mha.gov.in ఆన్లైన్ అప్లై చేసుకోవాలి.

భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ)లో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్ అంటే JIO-II/టెక్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో నెల జీతం రూ.25,500/- to రూ.81,100/- ఇస్తారు. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/టెక్ (JIO-II/టెక్) వయోపరిమితి 18-27 సంవత్సరాల మధ్య గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. సొంత రాష్ట్రంలోని రాత పరీక్ష మరియు పోస్టింగ్ వస్తుంది మీరు గాని అప్లై గాని చేసుకున్నట్లయితే.
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్ ఎక్సామినేటివ్-2025 విద్యా అర్హత ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెలి-కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ రంగాలలో ఇంజనీరింగ్ డిప్లొమా. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌తో సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా డిప్లమా ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

IB జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II రిక్రూట్‌మెంట్ కోసం జనరల్ / ఓబీసీ / ఇడబ్ల్యుఎస్ రూ.650/- & SC / ST / PwD / మాజీ సైనికుల రూ.550/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 23.08.2025 & దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 14.09.2025 (2359 గంటలు) లోపు దరఖాస్తులను MHA వెబ్‌సైట్ (www.mha.gov.in) లేదా NCS పోర్టల్ (www.ncs.gov.in) కు లాగిన్ అవ్వడం ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

🛑 Notification Pdf Click Here
🛑 Apply Online Link Click Here
🛑Official Website Click Here