APPSC Supervisor Grade-I Recruitment 2026: అంగన్వాడి సూపర్వైజర్ ఉద్యోగాలు అర్హతలు, దరఖాస్తు తేదీలు.. అర్హతలు ఇవే
APPSC Supervisor Grade 1 Recruitment 2026 Women 29 Posts : APPSC Supervisor Grade-I Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మహిళలకు 29 పోస్టులు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు. అర్హతలు, జీతం, పరీక్ష విధానం వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) Supervisor Grade-I పోస్టుల భర్తీకి Brief Notification No.13/2026ను విడుదల చేసింది. ఈ పోస్టులు A.P. Women Development and Child Welfare Subordinate Serviceలో భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. నవంబర్ 5న రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.

మొత్తం ఖాళీలు : Supervisor Grade-I పోస్టులకు ప్రస్తుతం 29 ఖాళీలు ఉన్నట్లు కమిషన్ ప్రకటించింది.
నెల జీతం : ఈ పోస్టులకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు పే స్కేల్ ఉంటుంది.
విద్య అర్హత : Supervisor Grade-I పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ నాటికి కింది విద్యార్హతల్లో ఏదైనా ఒకదాన్ని కలిగి ఉండాలి.
1. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ / B.S.W.
2. సోషియాలజీలో డిగ్రీ
3. B.Sc. (Hons.) Food Science & Nutrition
4. B.Sc. Food & Nutrition – Botany/Zoology & Chemistry/Bio-Chemistry
5. B.Sc. Applied Nutrition & Public Health – Botany/Zoology & కెమిస్ట్రీ
6. B.Sc. Clinical Nutrition & Dietetics – Botany/Zoology & Chemistry
7. B.Sc. Applied Nutrition – Botany/Zoology & Chemistry/Bio-Chemistry
8. B.Sc. Food Sciences & Quality Control – Zoology/Botany & Chemistry/Biological Chemistry
9. B.Sc. Food Sciences & Management – Botany/Zoology & Chemistry/Biological Chemistry
10. B.Sc. Food Technology & Nutrition – Botany/Zoology/Chemistry
11. B.Sc. Food Technology & Management – Botany/Zoology & Chemistry/Bio-Chemistry
ముఖ్యమైన తేదీలు Supervisor Grade-I పోస్టులకు దరఖాస్తులు అక్టోబర్ 16, 2026 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 5, 2026. పూర్తి నోటిఫికేషన్ కూడా అక్టోబర్ 16న APPSC వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.
అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసుకోవడం మంచిది. వయస్సు, కమ్యూనిటీ, పూర్తి విద్యార్హతలు, ఇతర అర్హతలు మరియు దరఖాస్తు విధానం వంటి వివరాలు Detailed Notificationలో ఉంటాయి.
ఎక్కడ అప్లై చేయాలి : అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇతర మార్గాల్లో పంపే దరఖాస్తులను స్వీకరించబోమని కమిషన్ స్పష్టం చేసింది.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

