నేతన్నల సేవలో.. లబ్ధిదారుల ఎంపిక గడువు పొడిగింపు.. ఒక్కొక్కరికి 25000 ఆర్థిక సహాయం
AP Nethannala Sevalo Scheme 25000 Assistance Latest News : ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు ప్రభుత్వం మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. ‘నేతన్నల సేవలో’ పథకం రెండో విడతకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక గడువును పొడిగించారు.
ఈ పథకం రెండో విడతలో ఇప్పటికే 36 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి సవిత తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులుగా ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
లబ్ధిదారుల ఎంపికకు ముందుగా నిర్ణయించిన గడువును ఈ నెల 3వ తేదీ వరకు పొడిగించినట్లు మంత్రి వెల్లడించారు. దీంతో అర్హత ఉన్న చేనేత కార్మికులకు మరింత అవకాశం లభించనుంది.
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, త్వరలో కొత్త పెన్షన్లు కూడా అందించనున్నట్లు చెప్పారు.
‘నేతన్నల సేవలో’ పథకం కింద ఎంపికయ్యే అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.25,000 చొప్పున త్వరలో జమ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.


