AP News : ఏపీలో ఇన్‌ఫ్లుయెన్సర్లకు గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి రూ.15 వేల వరకు ఆర్థిక సహాయం
Andhra Pradesh Social Media Influencer Policy 2026 AP Latest News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం కొత్త పాలసీ తీసుకొచ్చింది. 10 వేల నుంచి లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి కేటగిరీల ఆధారంగా రూ.2,500 నుంచి రూ.15,000 వరకు పారితోషికం అందించే విధానం వివరాలు తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం కొత్త పాలసీనీ తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవగాహనకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి చేరవేయడం ఈ పాలసీ ఉద్దేశంగా పేర్కొనబడింది. ఈ విధానంలో అర్హత ఉన్న డిజిటల్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంప్యానెల్ చేసి వారి కంటెంట్‌కు నిర్దేశిత పారితోషికం చెల్లించే విధానం ఉంటుంది.
ఏపీ ప్రభుత్వ సోషల్ మీడియా కొత్త పాలసీ ప్రకారం 50,000 నుంచి 99,999 మంది ఫాలోవర్లు ఉన్నవారికి రూ.7,500 వరకు, 25,000 నుంచి 49,999 మంది ఫాలోవర్లు ఉన్నవారికి రూ.5,000 వరకు, 10,000 నుంచి 24,999 మంది ఫాలోవర్లు ఉన్నవారికి రూ.2,500 వరకు చెల్లించే విధానం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే ఫాలోవర్స్ ఉంటే సరిపోదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, ప్రజా అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ విధానంలో ప్రధానంగా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రక్రియ, ధ్రువీకరణ, ఎంపిక నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తులు, ఎంప్యానెల్‌మెంట్‌కు సంబంధించిన తదుపరి వివరాలు ప్రభుత్వం అందించే అధికారిక మార్గదర్శకాల్లో స్పష్టమవుతాయి.


