Gurukul Jobs : మైనార్టీ గురుకుల పాఠశాల & కళాశాలలో టీచర్, డిప్యూటీ వార్డెన్ జాబ్స్ | Gurukul Schools/Colleges PGT- English & Deputy Warden Vacancies 2026

Gurukul Jobs : మైనార్టీ గురుకుల పాఠశాల & కళాశాలలో టీచర్, డిప్యూటీ వార్డెన్ జాబ్స్ | Gurukul Schools/Colleges PGT- English & Deputy Warden Vacancies 2026

Gurukul Schools/Colleges PGT- English & Deputy Warden Notification 2026 Apply Now : జిల్లాలో గల మైనార్టీ గురుకుల పాఠశాల/కళాశాలల యందు పి.జి.టి- ఇంగ్లీష్ టీచర్ & డిప్యూటీ వార్డెన్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

తెలంగాణ మైనార్టీ శాఖ ఆధ్వర్యములో కరీంనగర్ జిల్లాలో గల మైనార్టీ గురుకుల పాఠశాల/కళాశాలల యందు విధులు నిర్వహించుటకై ఈ క్రింద వివరించబడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులయిన కరీంనగర్ జిల్లా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. కావున ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు/ బయోడేటాతో పాటుగా అర్హత ధృవీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు తేది: 24/08/2026 సాయంత్రం 5:00 గంటలలోగా జిల్లా పరిశ్రమల కేంద్రము, పద్మానగర్, కరీంనగర్ నందు గల వారధి సొసైటీ కార్యాలయము నందు సమర్పించుటకై తెలుపనైనది.

ముఖ్యమైన తేదీలు:

ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18.08.2026

ఆఫ్ లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 24.08.2026

సంస్థ పేరు : మైనార్టీ గురుకుల పాఠశాల/కళాశాలలలో జాబ్స్

పోస్టుల వివరాలు : పి.జి.టి- ఇంగ్లీష్, డిప్యూటీ వార్డెన్ ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హతలు :

• పి.జి.టి- ఇంగ్లీష్ :: అభ్యర్థులు యూజిసి గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి ఎమ్.ఏ. (ఇంగ్లీష్) మరియు సంబంధిత సబ్జెక్ట్ నందు కనీసము 50% మార్కులతో మరియు యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు 45% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్ధులు యన్.సి.టి.ఇ గుర్తించిన విద్యాసంస్థ నుండి బి.ఇడి సంబంధిత సబ్జెక్ట్ మెథడాలజీలో ఉతీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్థులు గుర్తింపు పొందిన సీనియర్ సెకండరీ పాఠశాల యందు విద్యార్థులకు (2) సంవత్సరములు విద్యా బోధన చేసిన అనుభవం కలిగి ఉండాలి. (దరఖాస్తు వెంట అనుభవ ధ్రువీకరణ పత్రం సమర్పించవలయును).

• డిప్యూటీ వార్డెన్ :: అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సంబంధిత సబ్జెక్ట్ యందు ఉత్తీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్థులు యన్.సి.టి.ఇ గుర్తించిన విద్యా సంస్థ నుండి బి.ఇడి. ఉతీర్ణత పొంది ఉండవలయును.

ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం స్టార్టింగ్ సాలరీ  ₹31,395/- to ₹22,750/- వరకు వస్తుంది.

వయోపరిమితి : అభ్యర్థి వయస్సు తేది: 17/08/2026 నాటికి (18) నిండి (44) సంవత్సరములు దాటకుండా ఉండవలయును. బి.సి./ఎస్.సి/ యస్.టి. అభ్యర్ధులకు (5) సంవత్సరములు, అంగవైకల్యము కలవారికి (10) సంవత్సరములు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ (3) సంవత్సరములు వరకు వయస్సు సడలింపు కలదు.

దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీ లేదు.

అభ్యర్థుల ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:

• అభ్యర్ధులు తప్పనిసరిగా ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఏదేని నాలుగు సంవత్సరములు వరుసగా కరీంనగర్ జిల్లా నందు చదివి ఉండవలయును. మరియు సంబంధిత ధృవీకరణ పత్రము/స్టడీ సర్టిఫికెట్ జతపర్చవలయును.

• మిగతా వివరములకు/సందేహములకు కార్యాలయ పనివేళలయందు ఫోన్ నెంబర్ 0878-2241000 ద్వారా సంప్రదించగలరు. ఇట్టి ఉద్యోగ ప్రకటనలో సవరణలు లేదా రద్దుపర్చుటకై చైర్మన్, వారధి సొసైటి గారికి సంపూర్ణ అధికారము కలదు.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 18/08/2026
• దరఖాస్తు చివరి తేదీ: 24/08/2026

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *