ఈ కేవైసీ e-KYC లేకుంటే గ్యాస్ కట్.. మీ మొబైల్ లో 5 నిమిషాలలో ఈకే వేసి ఇలా చేయండి | LPG Gas Cylinder e-KYC in Mobile step by step process
LPG Gas Cylinder e-KYC in Mobile step by step process : గ్యాస్ వినియోగదాలకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 16 లోపు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయవలసి ఉందని గ్యాస్ కంపెనీలు మరొకసారి స్పష్టం చేశారు. లేదంటే గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ నిలిపివేస్తామని కస్టమర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పూర్తి చేసిన వారు మళ్లీ ఈకేవిసి చేయవలసిన అవసరం లేదని తెలిపారు. గ్యాస్ వినియోగదారులు ఈజీగా మొబైల్ ద్వారా లేదా గ్యాస్ ఏజెన్సీ ద్వారా లేదా డెలివరీ బాయ్స్ ద్వారా సులువుగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

తమ మొబైల్ ద్వారానే ఈజీగా LPG గ్యాస్ సిలిండర్ ఈ కేవైసీ పూర్తి చేయడం ఈ క్రింద విధంగా ఉంది
•ముందుగా మీ గ్యాస్ యాప్ (Indian Oil One, HP Pay, or Hello BPCL) ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
•ఆ తరువాత Aadhaar FaceRD యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి.
•LPG యాప్ ను ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.
•తర్వాత మెనూలోకి వెళ్లి ‘ప్రొఫైల్’ ఆప్షన్ వెళ్ళండి.
•e-KYC/ రీ-వెరిఫికేషన్ పై క్లిక్ చేయండి. మీ పేస్ కు కెమెరా స్క్రీన్ ను తిప్పి Aadhaar FaceRD అవుతుంది. మీ మొబైల్ లో ఎస్ఎంఎస్ వస్తుంది.
•ఈ ప్రక్రియ మీరు ఉదయం లేదా నైట్ టైం లో ప్రయత్నిస్తే వేగంగా అవుతుంది.
•పై చెప్పిన ప్రక్రియ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు లేదా ఏజెన్సీలు & డెలివరీ బాయ్స్ ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

•గమనిక : గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆగస్టు 16 లో పని ఈ కేవైసీ పూర్తి చేయండి లేకపోతే కనెక్షన్లు ఇబ్బందులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ దీపం 2 నిధులు కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది.

