AP Government : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..వీరికి రిటైర్మెంట్ ఏజ్ పెంచుతూ.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
AP Government employees Retirement Age Increased 2026 all details in Telugu : ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు & సొసైటీ ఉద్యోగులకు సంబంధించి పదవి విరమణ వయసు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలో పని చేస్తున్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ జీవో జారీ చేసింది. వారం క్రితం క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో 2022 జనవరి నుంచి వర్తిస్తుందని తెలియజేశారు. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఆసక్తి ఉన్న వారికి తిరిగి ఉద్యోగాలు తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,000 మందికి లబ్ధి పొందుతారు. మళ్లీ జాబ్ చేరేవరకు ఉన్న క్యాప్ పీరియడ్లో జీతం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వరకు పనిచేసే ఉద్యోగులకు పూర్తిస్థాయిలో సర్వీస్ బెనిఫిట్స్ అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే 60 సంవత్సరాల పదవి విరమణ పొంది తిరిగి విధుల్లో చేరకపోతే, ఆసక్తి లేకపోతే పాత నిబంధనలే వారికి రిటైర్మెంట్ వర్తిస్తాయని ఉత్తర్వులు పేర్కొన్నారు. ప్రతి ఒక్క సంస్థ తమ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఎన్ని నెలలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల తమ పరిధిలో పీఎస్ యూ లు, కార్పొరేషన్లు & సొసైటీలు వెంటనే ఉత్తర్వులు పంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదేశాలు జారీ చేశారు.


