AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఏపీ ప్రాంతీయ వైద్యశాలలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రములలో జాబ్స్ | AP Secondary Health Hospital Out Sourcing Recruitment 2026 Apply Now

AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఏపీ ప్రాంతీయ వైద్యశాలలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రములలో జాబ్స్ | AP Secondary Health Hospital Out Sourcing Recruitment 2026 Apply Now 

AP Secondary Health Hospital Out Sourcing Recruitment 2026 Latest Lab Attendant, Office Subordinate & Attendant/FNO/MNO Notification 2026 Apply Now:  డైరెక్టరేట్ అఫ్ సెకండరీ హెల్త్, ఆంధ్ర ప్రదేశ్ వారు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి పల్నాడు జిల్లాలో గల ప్రాంతీయ వైద్యశాలలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రములలో గల వివిధ రకముల సహాయక సిబ్బంది ల్యాబ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మోర్టమ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ యొక్క ఖాళీలను అవుట్ సోర్సింగ్ (Out Sourcing) పద్దతిన గౌరవనీయులైన కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, పల్నాడు జిల్లా వారి యొక్క పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, పల్నాడు జిల్లా వారిచే నియామకం జరుపుటకు నిర్ణయించడమైనది. కావున అర్హులైన అభ్యర్థుల నుండి 01.07.2026 నుండి 07.07.2026 వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు (భౌతిక దరఖాస్తులు) ఆహ్వానించబడుతున్నాయి. మరిన్ని వివరాలకు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వారి యొక్క కార్యాలయ పనివేళల్లో మరియు https://palnadu.ap.gov.in నందు తెలియజేయబడును.

పోస్ట్ వివరాలు

•సహాయక సిబ్బంది ల్యాబ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మోర్టమ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ యొక్క ఖాళీలను అవుట్ సోర్సింగ్ (Out Sourcing) పద్దతి పోస్టులను భర్తీ చేయనుంది.

•కనీస విద్య అర్హత : 

థియేటర్ అసిస్టెంట్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ల్యాబ్ అటెండెంట్ : ఎస్.ఎస్.సి/10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్వహించే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు) లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇతర సంస్థ నుండి ఉత్తీర్ణులై ఉండాలి.

GDA/MNO/FNO :: గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

పోస్ట్ మార్టం అసిస్టెంట్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఆఫీస్ సబార్డినేట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు :

•01.07.2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన అభ్యర్థులు అర్హులు మరియు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. సడలింపులు ఈ క్రింది విధంగా ఉంటాయి: –

ఎ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు.

బి. మాజీ సైనికులకు: సాయుధ దళాలలో చేసిన సేవ కాలానికి అదనంగా 03 (మూడు) సంవత్సరాలు.

సి. దివ్యాంగులకు: 10 (పది) సంవత్సరాలు.

డి. అన్ని సడలింపులు కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.

•నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లో నెలకు ₹15,000/- జీతం ఇస్తారు.

•అప్లికేషన్ ఫీజులు :: .

a. OC అభ్యర్థులకు = రూ.350/- (మూడు వందల యాభై రూపాయలు మాత్రమే)

b. SC/ST/BC/EWS అభ్యర్థులకు = రూ.250/- (రెండు వందల యాభై రూపాయలు మాత్రమే)

c. శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు రుసుము నుండి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ :: ఈ నోటిఫికేషన్ లో అర్హత పరీక్షలో లేదా ఏదైనా ఇతర సమానమైన అర్హతలో అన్ని సంవత్సరాలలో పొందిన మార్కుల మొత్తానికి 75% కేటాయించబడుతుంది. ఉత్తీర్ణత ధృవపత్రంలో పేర్కొన్న విధంగా అవసరమైన అర్హతను పొందిన తర్వాత పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 1.0 మార్కు చొప్పున 10 మార్కుల వరకు. వెయిటేజ్ కొత్త ప్రభుత్వ మెమో ఉటుంది.

•ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు నమూనా పల్నాడు జిల్లా వెబ్‌సైట్ (https://palnadu.ap.gov.in) లో 01.07.2026 ఉదయం 10:00 గంటల నుండి 07.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. భౌతిక దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 07.07.2026 సాయంత్రం 05:00 గంటలు. పూరించిన దరఖాస్తులను అవసరమైన పత్రాలతో పాటు, నరసరావుపేట, పల్నాడు రోడ్డులోని ఓల్డ్ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 0/0 DCHS, పల్నాడు జిల్లాలోని నిర్దేశిత కౌంటర్లలో పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆఫ్ లైన్దరఖాస్తు ప్రారంభ తేదీ : 01.07.2026

ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 07.07.2026 (23:59 గంటలు)

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *