విద్యార్థుల కోసం తపాలా శాఖ ద్వారా దీన్ దయాళ్ స్పర్శ యోజన ద్వారా 6000 ఆర్థిక సహాయం | Deen Dayal SPARSH Yojana Scholarship 2026
Deen Dayal SPARSH Yojana Scholarship 2026 Apply Now : విద్యార్థులకు శుభవార్త.. 2026-27 సంవత్సరానికి దీన్ దయాళ్ స్పర్శ యోజన ద్వారా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ప్రతి అవార్డు గ్రహీతకు ఇచ్చే స్కాలర్షిప్ మొత్తం రూ.6,000/- ఉంటుంది.

ఫిలాటెలీ అనేది స్టాంపులు, తపాల చరిత్ర మరియు తపాల బిల్లుల సేకరణ పరిధిని పెంచే ప్రయత్నం చేసేందుకు విద్యార్థుల ఫిలాటెలీ పట్ల ఆసక్తి పెంచేందుకు తపాలా శాఖ దీన్ దయాళ్ స్పర్శ యోజన ఫిలాటెలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో గుర్తింపు పొందిన పాఠశాలలో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రతిభ కలిగిన, ఫిలాటెలీ అభిరుచి కొనసాగుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ అర్హులు. స్కాలర్షిప్ ప్రధాననికి ఎంపిక చేసే సమయంలో, అభ్యర్థి ఇటీవల చదివిన పరీక్ష కనీసం 60 శాతం మాక్స్ లేదా దాని సమానమైన గ్రేడ్ పాయింట్ సాధించిన ఉండాలి. SC, ST అభ్యర్థులు మాత్రం 5% సడలింపు ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులను కరెంట్ అఫైర్స్, భూగోళ శాస్త్రం, చరిత్ర, సైన్స్, క్రీడా సంస్కృతి మరియు స్థానిక జాతీయ ఫిలాటెలీ అంశాలపై గంటపాటు లెవెల్-1 స్క్రీనింగ్ టెస్ట్, ఫిలాటెలీ రాత పరీక్ష నిర్వహిస్తారు. మరియు అందులో నుంచి ప్రతి తరగతికి సుమారుగా 40 మంది అభ్యర్థులను ఫిలాటెలీ లెవెల్-2 సమర్పించడానికి అనుమతిస్తారు. స్కాలర్షిప్ కేవలం ఫిలాటెలీ ప్రాజెక్టులో పొందిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ప్రధానం చేయబడును. లెవెల్ 1 నుంచి అర్హత పొందిన విద్యార్థులు తమ ప్రాజెక్ట్ పనిని 4 నుండి 5 పేజీలలో, 16 స్టాంపులు ఉపయోగించి సమర్పించాలి. అందులో అవార్డు గ్రహీతకు ఇచ్చే స్కాలర్షిప్ మొత్తం 6000 మరియు దీనికి ఒక సంవత్సరానికి పాటు ప్రతి తరగతికి 10 మంది విద్యార్థులకు త్రైమాసిక ప్రాతిపదికన 1500 చొప్పున చెల్లిస్తారు.
విద్యార్థి పాఠశాలలో ఫిలాటెలీ క్లబ్ లు సభ్యులై ఉండాలి. ఒకవేళ పాఠశాలలు ఫిలాటెలీ క్లబ్ ఏర్పాటు చేయని పక్షంలో సొంత ఫిలాటెలీ డిపాజిట్ ఖాతా ఉన్న విద్యార్థి విని కూడా పరిగెనగ తీసుకుంటారు. కొత్త ఫిలాటెలీ డిపాజిట్ ఖాతాను తెరవడానికి ప్రధాన కార్యాలయంలో ఓపిఓను సంప్రదించాలి. ఆసక్తికరమైన మరియు అర్హత ఫామ్ కావాలనుకున్న అభ్యర్థులు తపాలా కార్యాలయంలో సీనియర్/సూపరింటెండెంట్ కార్యాలయంలో సమర్పించుకోవచ్చు. ప్రస్తుతం కేరళలో స్టార్ట్ అవడం జరుగుతుంది. పై చెప్పిన అన్నీ కూడా రెడీ చేసుకున్నట్లయితే, ఆంధ్ర మరియు తెలంగాణలో వచ్చిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. దరఖాస్తులను www.indiapost.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

🛑 Example KeralaApplication Pdf Click Here
🛑Official Website Click Here

