AP Thalliki Vandanam : తల్లికి వందనం రూ. 13,000/- రావాలంటే తప్పకుండా ఇలా చేయండి
AP Thalliki Vandanam scheme 2026 Release Date Latest News : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు శుభవార్త తల్లికి వందనం జూలై మూడో వారంలో రూ.13,000/- రూపాయలు జమ కానున్నాయి. అయితే ఈ కింది పనులు పూర్తి చేస్తేనే మీ అకౌంట్లో డబ్బులు పడతాయని అధికారులు తెలియజేశారు.

ముందుగా ఆధార్ సీడింగ్ అనగా (బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ లేకుంటే పూర్తి కాకుండా డబ్బులు రావు. తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకు బ్యాంకు లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డు ద్వారానే మీ బ్యాంకులో డైరెక్ట్‌గా అకౌంట్ లోకి అమౌంట్ పోతుంది. అలాగే బ్యాంకుకు వెళ్లి ఈ కేవైసీ & NPCI మ్యాపింగ్ కూడా పూర్తి చేయండి.
విద్యార్థుల స్కూల్లో అటెండెన్స్ 75% తప్పనిసరిగా ఉండాలి అప్పుడే మీకు తల్లికి వందనం అమౌంట్ పడుతుంది. ఆధార్ కార్డులో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే సరి చేసుకోవాలని తెలియజేస్తున్నారు. తమ సచివాలయ డేటా బేసిస్ లో కుటుంబ వివరాలు తక్కువగా ఉన్నట్లయితే మీకు అమౌంట్ రాదు. ఆధార్ కార్డు, ఈ కేవైసీ, NPCI తప్పకుండా తమ బ్యాంకు వెళ్లి చెక్ చేసుకోండి. అన్ని ఆధార్ కార్డు తో లింక్ అయ్యాయా లేదా తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ముఖ్యంగా తమ గ్రామ వార్డు సచివాలయం వెళ్లేసి కనుక్కున్నట్లయితే అక్కడ కూడా మీకు సమాచారం ఇస్తారు.

