TS Government Jobs : No Exam..10th అర్హతతో అసిస్టెంట్ లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్స్ & ఆఫీస్ సబార్డినేట్నోటిఫికేషన్ వచ్చేసింది | TS Government Nursing College Recruitment 2026 Apply Online Now
Latest TS Government Nursing College Recruitment 2026 Latest Data Entry Operator, Assistant Librarian & Lab Attendants Job Notification 2026 Apply Now : తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యములో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, కరీంనగర్ నందు విధులు నిర్వహించుటకై డాటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్/మెకానిక్, ల్యాబ్ అటెండెంట్స్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్, కుక్ & కిచెన్ బాయ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులయిన కరీంనగర్ జిల్లా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. మొత్తం పోస్టులు 22 ఉన్నాయి. 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ (యం.ఎల్.టి.) & ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వయసు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. కావున ఆసక్తి గల అభ్యర్ధులు వారి యొక్క దరఖాస్తు/ బయోడేటాతో పాటుగా అర్హత దృవీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు గెజిటెడ్ అధికారి దృవీకరణతో తేది 12-01-2026 వరకు ప్రతిరోజు ఉదయం గం. 9-00 నుండి సాయంత్రం 4-00 గంటల వరకు లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

Latest TS Government Nursing College Recruitment 2026 Latest Data Entry Operator, Assistant Librarian & Lab AttendantsJob Recruitment 2026 Apply 22 Vacancy Overview :
సంస్థ పేరు :: తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యములో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జాబ్స్
పోస్ట్ పేరు :: డాటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్/మెకానిక్, ల్యాబ్ అటెండెంట్స్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్, కుక్ & కిచెన్ బాయ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 22
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్ట్ & అవుట్ సోర్సింగ్ పద్ధతిలో
వయోపరిమితి :: 18- 44 సంవత్సరాల
విద్య అర్హత :: 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ (యం.ఎల్.టి.) & ఏదైనా డిగ్రీ
నెల జీతం :: రూ.15,600/-to రూ.19,500/-
దరఖాస్తు ప్రారంభం :: 02 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 12 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్సైట్ :: https://karimnagar.telangana.gov.in/
»పోస్టుల వివరాలు:
డాటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్/మెకానిక్, ల్యాబ్ అటెండెంట్స్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్, కుక్ & కిచెన్ బాయ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 53 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•డాటా ఎంట్రీ ఆపరేటర్ :: అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీ లేదా డిగ్రీతో పాటుగా పి.జి.డి.సి.ఏ. నందు ఉత్తీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్థి డాటా ఎంట్రీ ఆపరేటర్ గా ఏదేని ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయమునందు కనీసము (02) సంవత్సరముల పని చేసిన అనుభవం కలిగి యుండవలయును మరియు అనుభవ ధ్రువీకరణ పత్రము సమర్పించవలయును.
•రికార్డు అసిస్టెంట్ :: అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్థి ఏదేని గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుండి మెడికల్ రికార్డు డిప్లొమా నందు ఉత్తీర్ణత పొంది ఉండవలెను. మరియు మెడికల్ రికార్డు నిర్వహణ యందు (02) సం॥ల పనిచేసిన అనుభవం కలిగియుండవలయును. మరియు అనుభవ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

•అసిస్టెంట్ లైబ్రేరియన్ :: అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ (BLISC) నందు ఉత్తీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్థి మెడికల్ డిపార్టుమెంట్ నందు కనీసము (02) సంవత్సరములు అసిస్టెంట్ లైబ్రేరియన్గా పనిచేసిన అనుభవం కలిగియుండాలి మరియు అనుభవ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
•ఎలక్ట్రిషియన్/మెకానిక్ :: గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణ సంస్థ నుండి డిప్లొమా ఎలక్ట్రిషియన్ లేదా ఐటీఐ ఎలక్ట్రిషియన్ నందు ఉత్తీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్థి ఏదేని ప్రభుత్వ/ ప్రైవేట్ సంస్థ నందు కనీసం (02) సంవత్సరములు పని చేసిన అనుభవం కలిగి ఉండాలి. మరియు అనుభవ ద్రువీకరణ పత్రం సమర్పించాలి
•ల్యాబ్ అటెండెంట్స్ :: అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుండి బీఎస్సీ (యం.ఎల్.టి.) లేదా డియంయల్ టి లేదా ఎమ్.ఎల్ నందు ఉత్తీర్ణత పొంది ఉండవలెను. మరియు తెలంగాణ పారా మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ అయి ఉండవలయును. అభ్యర్థి ఏదేని ప్రభుత్వ/ ప్రైవేట్ హాస్పిటల్స్ లాబోరేటరీనందు కనీసం రెండు సంవత్సరముల పని చేసిన అనుభవం ఉండాలి మరియు అనుభవ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

•డ్రైవర్ :: అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్థి మోటారు వాహన చట్టం 1988 ప్రకారం భారీ మోటారు వాహనాలను నడపటానికి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తోపాటుగా బ్యాడ్జ్ ఉండవలయును. అభ్యర్థి కనీసం రెండు సంవత్సరములు గుర్తింపు పొందిన ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థనందు పని చేసిన అనుభవం ఉండాలి. మరియు అనుభవ ద్రువీకరణ పత్రం సమర్పించాలి.
•ఆఫీస్ సబార్డినేట్ :: అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్థి ఏదేని ప్రభుత్వ/ ప్రైవేట్ కార్యాలయము నందు ఆఫీస్ సబార్డినేట్/ అటెండర్గా కనీసం(02) సంవత్సరములు పనిచేసిన అనుభవం ఉండాలి. మరియు అనుభవ ద్రువీకరణ పత్రం సమర్పించాలి.
•లైబ్రరీ అటెండెంట్ :: అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండవలయును. అభ్యర్థి ఏదేని లైబ్రరీనందు కనీసం (02) సం॥లు అటెండర్ గా పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. మరియు అనుభవ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

•కుక్ :: అభ్యర్థి తప్పనిసరిగా ఐదవ తరగతి లేదా ఏడవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండవలెను. అభ్యర్థి కనీసం (05) సంవత్సరములు గుర్తింపు పొందిన సంస్థనందు వంట చేసిన పని అనుభవం కలిగి ఉండాలి మరియు అనుభవ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అభ్యర్థి సుమారు (240) మందికి వంట చేయవలసి ఉంటుంది.
•కిచెన్ బాయ్ :: అభ్యర్థి తప్పనిసరిగా ఐదవ తరగతి లేదా ఏడవ తరగతి ఉత్తీర్ణత ఉండవలయును. అభ్యర్థి కనీసం (02) సంవత్సరములు గుర్తింపు పొందిన సంస్థ నందు వంటగదిలో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి మరియు అనుభవ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో పోస్టుకు అనుసరించి నెలకు రూ.15,600/-to రూ.19,500/- జీతం ఇస్తారు.
»వయోపరిమితి: అభ్యర్థి వయస్సు తేది: 01-01-2026 నాటికి (18) నిండి (44) సంవత్సరములు దాటకుండా ఉండవలయును. బి.సి./ఎస్.సి./ఎస్.టి. అభ్యర్థులకు (5) సంవత్సరములు, అంగవైకల్యము కలవారికి (10) సం॥, ఎక్స్ సర్వీస్ మెన్ (3) సం॥లు వరకు వయస్సు సడలింపు కలదు.
»దరఖాస్తు రుసుము :: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: అభ్యర్థులు తప్పనిసరిగా ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఏదేని నాలుగు సంవత్సరములు వరుసగా కరీంనగర్ జిల్లా నందు చదివి ఉండవలయును మరియు సంబంధిత ధ్రువీకరణ పత్రము/స్టడీ సర్టిఫికెట్ జతపర్చవలెను.
»ఎలా దరఖాస్తు చేయాలి : కావున ఆసక్తి గల అభ్యర్ధులు వారి యొక్క దరఖాస్తు/ బయోడేటాతో పాటుగా అర్హత దృవీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు గెజిటెడ్ అధికారి దృవీకరణతో తేది: 12-01-2026 వరకు ప్రతిరోజు ఉదయం గం. 9-00 నుండి సాయంత్రం 4-00 గంటల వరకు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళు రోడ్ కమాన్ దాటిన తరువాత కొటక్ మహీంద్రా బ్యాంకు వెనుక వైపు గల మిత్రా ఎవెన్స్లో గల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, గణేష్నగర్, డోర్ నెం. 8-7-926/డి నందు సమర్పించుటకై తెలుపనైనది. ఇతర వివరముల కొరకు కార్యాలయము ఫోన్ నెంబర్: 9502707616కు కార్యాలయ పనివేళలందు సంప్రదించగలరు.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ :: 02.01.2026
•ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 12.01.2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

