CMSRU Jobs : కొత్త గా అసిస్టెంట్ & స్టోర్ కీపర్ నోటిఫికేషన్ విడుదల| CMSRU Notification 2025 Apply Now
CMSRU Recruitment 2025 Latest Assistant & Storekeeper Job Notification 2025 Apply Now: నిరుద్యోగులకు మంచి అదిరిపోయే శుభవార్త ఎందుకంటే ఈరోజు మేము మీకోసం.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL), ముంబైలోని CSL ముంబై షిప్ రిపేర్ యూనిట్ (CMSRU) కోసం అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & స్టోర్ కీపర్ సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి అర్హత అవసరాలను తీర్చే భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ లేదా డిప్లమా పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ కులం (SC)/ షెడ్యూల్డ్ తెగ (ST) & PwBD దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. స్టోర్ కీపర్ ఉద్యోగాలకి స్టార్టింగ్ శాలరీ రూ.45,623/- & అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు ₹60,704/- ఇస్తారు. గరిష్ట వయోపరిమితి 19 జనవరి 2026 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తును www.cochinshipyard.in (కెరీర్ పేజీCMSRU) వెబ్‌సైట్ ద్వారా 25 డిసెంబర్ 2025 నుండి 19 జనవరి 2026 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

CMSRU Assistant & Storekeeper Job Recruitment 2025 Apply 03 Vacancy Overview :
సంస్థ పేరు :: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో జాబ్స్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 03
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18-45 సంవత్సరాల
విద్య అర్హత :: Any డిగ్రీ & డిప్లమా
నెల జీతం :: రూ.₹28,000-3%-1,10,000/-
దరఖాస్తు ప్రారంభం :: 25 డిసెంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 19 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ ::www.cochinshipyard.in/
»పోస్టుల వివరాలు:
•అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 03 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత:
•అసిస్టెంట్ ఇంజనీర్ :: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా మాజీ సైనికుల విషయంలో తత్సమాన అర్హతలు. ఇండియన్ నేవీ/షిప్ బిల్డింగ్/షిప్ రిపేర్/ఇంజనీరింగ్ కంపెనీలో ఇన్‌స్టాలేషన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్, రిపేర్స్, ట్రయల్స్ మరియు కమీషనింగ్ ఆఫ్ ఆయుధ సంబంధిత యంత్రాలు వంటి వాటిలో కనీసం తొమ్మిది సంవత్సరాల అనుభవం. నావల్ వెసల్స్ / కోస్ట్ గార్డ్ వెసల్స్‌లో కమ్యూనికేషన్, సెన్సార్లు మరియు కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్.
•అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ :: ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ లో డిగ్రీ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి కనీసం 60% మార్కులతో కమర్షియల్ ప్రాక్టీస్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. ఆఫీస్ వర్క్, ERP సిస్టమ్ అప్‌డేట్ చేయడం, మ్యాన్ అవర్ బుకింగ్, డేటా ఎంట్రీ, రికార్డ్ మరియు రిపోర్ట్ జనరేషన్, ఫైల్స్, రిజిస్టర్లు మరియు రికార్డుల నిర్వహణ వంటి విషయాలలో ఏడు సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం, వీటిలో రెండు సంవత్సరాలు సూపర్‌వైజరీ గ్రేడ్‌లో ఉండాలి మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

•స్టోర్ కీపర్ :: మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతో గ్రాడ్యుయేట్. ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్).

»నెల జీతం : నోటిఫికేషన్ లో రూ.₹28,000-3%-1,10,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు. మొత్తం కలిపి స్టార్టింగ్ శాలరీ రూ.45,623/- to ₹60,704/- ఇస్తారు.

»వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 19 జనవరి 2026 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు, అంటే దరఖాస్తుదారులు 20 జనవరి 1981న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PwBD) మరియు మాజీ సైనికులకు భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. అయితే, అన్ని వయో సడలింపులు గరిష్టంగా 50 సంవత్సరాల వయస్సుకు లోబడి ఉంటాయి.
»దరఖాస్తు రుసుము :: ₹400/- దరఖాస్తు రుసుము (తిరిగి చెల్లించబడదు, షెడ్యూల్డ్ కులం (SC)/ షెడ్యూల్డ్ తెగ (ST) దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు బెంచ్మార్క్ వైకల్యాలున్న వ్యక్తి (PwBD) దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
»ఎంపిక విధానం: ఎంపిక పద్ధతిలో ఇవి ఉంటాయి:- దశ I – రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్-40 మార్కులు & డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్-40 మార్కులు), దశ II-పని అనుభవంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (20 మార్కులు), ఆన్‌లైన్ దరఖాస్తుల సంఖ్యను బట్టి, ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ముంబైలో లేదా CMSRU నిర్ణయించిన ఇతర ప్రదేశంలో నిర్వహించబడుతుంది. పరీక్షా కేంద్రం కేటాయింపు CSL యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తుదారులు ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే ముందు www.cochinshipyard.in (కెరీర్ పేజీ CMSRU, ముంబై) లింక్‌లో ప్రచురించబడిన యూజర్ మాన్యువల్ మరియు తరచుగా అడిగే ప్రశ్నలను పరిశీలించాలి. దరఖాస్తు రెండు దశల్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మరియు పోస్ట్‌కు దరఖాస్తు సమర్పణ. దరఖాస్తుదారులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను సమర్పించకూడదు. ఒకసారి సమర్పించిన దరఖాస్తు తుది దరఖాస్తు అవుతుంది.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం :: 25 డిసెంబర్ 2025
•ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 19 జనవరి 2026

🛑Storekeeper Notification Pdf Click Here
🛑 Assistant Notification Pdf Click Here
🛑 Official Website Click Here

