ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఆఫీస్ లో జూ. సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIP JSARecruitment 2025 Notification in Telugu | Job Search
CSIR Indian Institute of Petroleum Recruitment 2025 Latest Junior Secretary Assistant Jobs Notification All Details In Telugu : కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకు సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వయంప్రతిపత్తి సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలోని ఒక ప్రముఖ సంస్థ, డెహ్రాడూన్‌లోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, కింది జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో రూ.19,900/- రూ.63,200/- నెల జీతం ఇస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ July 21, 2025 & దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగష్టు 04, 2025 (సాయంత్రం 5:30) లోపు అప్లై చేయాలి.

CSIR IIP JSA ముఖ్యమైన వివరాలు :
సంస్థ పేరు :: CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం లో నోటిఫికేషన్ విడుదల
పోస్ట్ పేరు :: జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టుల భర్తీ.
వయోపరిమితి :: 18 to 28 Yrs
మొత్తం పోస్ట్ :: 02
దరఖాస్తు ప్రారంభం :: 21 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 04 ఆగష్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::https://www.iip.res.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
జాబ్ విధానం: పర్మనెంట్ & శాశ్వత ఉద్యోగాలు
జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ అర్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్ నైపుణ్యం ఇంగ్లీష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ నాలెడ్జి కలిగి ఉండాలి.

అభ్యర్థి వయసు : (19 జులై 2025 నాటికి) : కనీసం: 18 సం||రాలు మరియు గరిష్టం 28 సం||రాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
•ఎస్సీ/ఎస్టీ: 5 సం||రాలు
•ఓబీసీ: 3 సం||రాలు
•పీడబ్ల్యూడీ: 10 సం||రాలు వయస్సులో సడలింపులు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: సాధారణ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ.500/- & ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా/ఎక్స్-సర్వీస్‌మెన్/సీఎస్‌ఐఆర్ ఉద్యోగులు: NIL
ఎంపిక విధానం: లిఖిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ స్కిల్స్‌పై ఆధారితం, టైపింగ్ టెస్ట్: ఇంగ్లీష్‌లో నిమిషానికి 35 & హిందీలో నిమిషానికి 30 పదాల, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
పరీక్ష విధానం: రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) ద్వారా సెలక్షన్ చేస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది.
ఆన్‌లైన్ రుసుమును సమర్పించే విధానం క్రింద ఇవ్వబడింది:
1) https://www.onlinesbi.sbi సైట్ తెరవండి
2) “SB కలెక్ట్” పై క్లిక్ చేయండి
3) “ప్రభుత్వ శాఖ” పై క్లిక్ చేయండి
4) “డైరెక్టర్ IIP” కోసం శోధించి దానిపై క్లిక్ చేయండి.
5) చెల్లింపు వర్గం నుండి, “దరఖాస్తు రుసుము” ఎంచుకోండి
6)వివరాలను పూరించండి. సంబంధిత విభాగంలో, “రిక్రూట్‌మెంట్” అని పేర్కొనండి.
7) రూ. 500 రుసుము సమర్పించండి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here