ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
ASHA Worker Notification 2025 latest district wise job notification in Telugu : అనంతపురము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, కమ్యూనిటీ ప్రొసెస్, నేషనల్ హెల్త్ మిషన్, NIIM, పధరంలో భాగంగా అనంతపురము జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో 58 మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది, అర్హులైన వారు తేది. 25,06,2025 నుండి 30.06.2025 వరకు (29.06.2025 ఆదివారం శలవు) ఖాళీగా ఉన్న సచివాలయములలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారణీ డా.E.B.దేవిగారు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఆశా కార్యకర్తల నియానుకం గ్రామీణ/ పట్టణ ఆరోగ్య పారిశుధ్య పౌష్టికాహార కమిటీ (VHSNC/UHSNC) ద్వారా వచ్చిన దరఖాస్తుల నుండి ప్రతిభ కలిగిన 3 ఆప్లికేషన్లు జిల్లా ఆఫీసుకు పంపవలెను, వచ్చిన అప్లికేషన్లు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారి ద్వారా నియామకాలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి డా.E.B.దేవిగారు గారు తెలియజేయడం జరిగింది.

అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు:
√ తప్పనిసరిగా మహిళా అభ్యర్థి. సంబంధిత గ్రామ / వార్డులో నివసిస్తూ, 25 సంవత్సరముల నుండి 45 సంవత్సరముల వయసు కలిగి, వివాహితై ఉండాలి.
√ వితంతువులు,విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయియిన లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
√ 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
√ తెలుగు బాగా చదవటం, రాయటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
√ ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యము వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకి వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగివుండాలి.
దరఖాస్తు తో పాటు అందజేయవలసిన ధ్రువపత్రములు:
√ నివాస ధృవీకరణపత్రము (తహసీల్దారు ద్వారా జారీచేయబడిన నివాస దృవీకరణపత్రము / రేషన్ కార్డు/బి పి.యల్ కార్డు/ఓటరు కార్డు / ఆధార్ కార్డు /బ్యాంకు పాస్ పుస్తకము)
√ 10 వ తరగతి సర్టిఫికెట్ కాపీ.
√ వైవాహిక స్థితి: వితంతువు/ విడాకులు పొందిన / భర్త నుండి విడిపోయిన/ నిరాశ్రయురాలు అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించి స్వంత డిక్లరేషన్.
నోటిఫికేషన్ కోసం షెడ్యూల్
1. నోటిఫికేషన్ తేదీ : 23.06.2025
2. దరఖాస్తు అందిన తేదీ : 25.06.2025 నుండి 30.06.2025 వరకు 29.06.2025 (ఆదివారం సెలవు)
3. దరఖాస్తుల పరిశీలన : 01.07.2025 నుండి 02.06.2025 వరకు
4. తాత్కాలిక జాబితాను ప్రచురించడం : 03.07.2025
5. తాత్కాలిక జాబితాపై అభ్యంతరాలు : 04.07.2025
6. తుది మెరిట్ జాబితా ప్రచురణ : 05.07.2025
గమనిక: తుది మెరిట్ జాబితా మరియు అన్ని దరఖాస్తులు DM & HO కార్యాలయంలో, అనంతపురంలో సమర్పించాలి. తేదీ: 07.07.2025.
సూచన: పై నియామకమునకు సంబంధించిన ఖాళీలు / అర్హత నిబంధనలలో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసే అధికారము డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారికి కలదని తెలియపరచటమైనది.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
- Indian Railway : రైల్వేలో బిగ్ అప్డేట్.. రైల్వే శాఖలో కొత్త కొలువుల జాతర
- AP EAPCET 2026 : రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం.. అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే
- స్టార్టింగ్ శాలరీ రూ.47,600/- 10th అర్హతతో LDC & జనరల్ ఎంప్లాయిస్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Balachadi Notification 2026
- Agriculture Jobs : 10+2 అర్హతతో వ్యవసాయ శాఖలో రిసెప్షనిస్ట్ టెలి ఆపరేటర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIPER Non Teaching Recruitment 2026 Apply Now
- AP Outsourcing Employees : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… ఔట్సోర్సింగ్ సిబ్బందికి అంత్యక్రియల ఖర్చు రూ. 20 వేలకు పెంపు.
- Central University Jobs : 10th అర్హతతో క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండంట్ & MTS నోటిఫికేషన్.. 10th, 12th అర్హతతో అప్లై చేసుకోవచ్చు
- New Ration Card : క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు.. e-KYC ఈనెల 31 వరకే గడువు
- తల్లికి వందనం 13000 జూలై 22న ఖాతాలో జమ కావాలంటే.. ఈ విద్యార్థికి బ్యాంకు ఖాతా తెరవండి.. వివరాలు ఇవే

