Free Aadhaar Service Camps 2026 : ఈ నెల 21 నుంచి ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు
Free Special Aadhaar Service Camps 2026: ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలలో ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్వర్ణ గ్రామ/ వార్డు అధికారి గారు కె.వీ.ఎస్ రవికుమార్ గారు గురువారం ఒక ప్రకటన తెలిపారు.

స్వర్ణ గ్రామ/ వార్డు కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో ఎంపిక చేసిన ఆధార్ సేవా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదులో (5 నుంచి 15 ఏళ్లు, 15 ఆ పైబడిన సంవత్సరాలు) పిల్లలకు నూతన ఆధార్ నమోదు ప్రస్తుతం ఉన్న ఆధార్లో పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నెంబరు బయోమెట్రిక్ వివరాలు సవరించడానికి మరియు పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసం, ఇతర ఆధార్ సంబంధిత సవరణ చేయనున్నట్లు పేర్కొన్నారు.
కొత్తగా ఆధార్ కార్డు చేసుకోవాలనుకున్న విద్యార్థులు పుట్టిన తేదీ దృవీకరణ పత్రం, తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డు తీసుకెళ్లా సరిపోతుంది.


