Fireman Jobs : 10th అర్హతతో ఫైర్‌మెన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
CSLFireman Notification 2025 in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో 24 కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫైర్‌మెన్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 12 మే 2025 & ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 23 మే 2025. టెన్తోపాటు యూనియన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన చెల్లుబాటు అయ్యే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. గరిష్ట వయోపరిమితి 23 మే 2025 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఫైర్‌మెన్ పోస్టులు కోసం నెల జీతం మొదటి సంవత్సరం 27,630/-, రెండవ సంవత్సరం రూ 28,500/- మరియు మూడవ సంవత్సరం 29,250/- నెల జీతం ఇస్తారు. గరిష్ట వయోపరిమితి 23 మే 2025 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. OBC (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 3 సంవత్సరాలు మరియు SC అభ్యర్థులకు 5 సంవత్సరాలు రిజర్వ్ చేయబడిన పోస్ట్‌లలో సడలింపు ఉంటుంది.
CSL ఫైర్ మాన్ ఉద్యోగులకు దరఖాస్తుదారులు ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే ముందు www.cochinshipyard.in (కెరీర్ పేజీ CSL, కొచ్చి) లింక్‌లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥Notification Pdf Click Here
🛑Apply Link Click Here