SRTRI DDUGKY Free Training : పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ మరియు ఉద్యోగం
SRTRI DDUGKY Free Training: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఒక మంచి శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (SRTRI), దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా ఉచిత సాంకేతిక శిక్షణ, మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.
ఈ శిక్షణ ద్వారా అభ్యర్థులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న క్రింది కోర్సుల్లో అవగాహన మరియు నైపుణ్యం పొందవచ్చు:
• అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ)
• కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్
• ఆటో మొబైల్ 2 వీలర్ సర్వీసింగ్
ఈ కోర్సులు పూర్తిగా ఉచితం. శిక్షణా వ్యవధి సుమారు 3½ నెలలు ఉంటుంది.
ఈ శిక్షణా కార్యక్రమంలో చేరాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి: అర్హత పదో తరగతి / ఇంటర్ / డిగ్రీ (బీకామ్) ఉత్తీర్ణులు వయో పరిమితి కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 30 సంవత్సరాలు నివాస స్థలం గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కావాలి ఇతర అర్హతలు చదువు మధ్యలో ఆపిన అభ్యర్థులు అర్హులు కాదు
దరఖాస్తు విధానం : ఈ శిక్షణ కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలు మే 5, 2025 నుండి ప్రారంభమవుతాయి.
దరఖాస్తు సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు: విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు & పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తదితర డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది.
శిక్షణా కేంద్రానికి రవాణా సదుపాయం : శిక్షణా కేంద్రం పట్టణానికి సమీపంలో ఉండటంతో, బస్సు మరియు రైలు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇది అభ్యర్థులకు సులభంగా చేరుకోవడానికి సహాయపడుతుంది.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు : శిక్షణా కోర్సులు, దరఖాస్తు ప్రక్రియ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ కింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు:
• 9133908000
• 9133908111
• 9133908222
• 9948466111