ఆంధ్రప్రదేశ్ లో భారీగా జాబ్ కేలండర్ విడుదల | Andhra Pradesh Job APPSCCalendar 2025 | AP Government Jobs Notification
Andhra Pradesh APPSCJob Calendar Notification : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నది. ఈ సందర్భంగా 18 శాఖల్లో 866 కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ ఉద్యోగాలకి టెన్త్,ఇంటర్, ఎన్ని డిగ్రీ & డిప్లమా ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు, డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2-టెక్నికల్ అసిస్టెంట్, ఠాణేదార్, మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా సైనిక్ ఆఫీసర్, గ్రంథ పాలకులు, హార్టీకల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

ఆర్గనైజేషన్ వివరాలు
ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా నిర్వహించనుంది. విభిన్న శాఖలు ఈ నోటిఫికేషన్ ప్రక్రియలో భాగస్వామ్యమవుతాయి. ముఖ్యంగా అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, భూగర్భ నీటిపారుదల, మత్స్యశాఖ, దివ్యాంగుల సంక్షేమ శాఖ & దేవాదాయ వంటి విభాగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఖాళీలు వివరాలు
ఈ నోటిఫికేషన్లలో అటవీ శాఖకు అత్యధికంగా ఖాళీలు కేటాయించబడ్డాయి. ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి:
• అటవీ శాఖ : సెక్షన్ ఆఫీసర్ – 100 (30 క్యారీ ఫార్వర్డ్)
• బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ ఆఫీసర్ – 681 (141 క్యారీ ఫార్వర్డ్)
• టెక్నికల్ అసిస్టెంట్ – 10 : మున్సిపల్ శాఖ
• జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ – 11 : దేవాదాయ శాఖ
• ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – 10 : మత్స్య శాఖ
• అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ – 2
• అగ్రికల్చర్ ఆఫీసర్ (వ్యవసాయ శాఖ) -10
• ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాదాయ) – 07
• జిల్లా సైనిక్ ఆఫీసర్ – 07
• గ్రంథ పాలకులు (ఇంటర్ విద్య) – 02
• హార్టీకల్చర్ ఆఫీసర్ (ఉద్యానవన) – 02
• అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (మత్స్యశాఖ) -03
• టెక్నికల్ అసిస్టెంట్ (భూగర్భ నీటిపారుదల) – 04 తదితర ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు.
అర్హతలు
ప్రతి పోస్టుకు సంబంధించి నిర్దిష్ట విద్యార్హతలు మరియు అనుభవాలు అవసరం. సాధారణంగా 10th, 12th, గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో డిప్లొమా అర్హతగా ఉంటుంది. కొంతమంది పోస్టులకు ప్రత్యేక టెక్నికల్ అర్హతలు అవసరం.
వయోపరిమితి
ఈ నోటిఫికేషన్లకు సంబంధించి వయో పరిమితి ఈ విధంగా ఉంటుంది:
• కనిష్ట వయస్సు : 18 ఏళ్లు
• గరిష్ట వయస్సు : 42 ఏళ్లు
• వయోసడలింపులు: రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వం నియమించిన ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులుwww.psc.ap.gov.in సంబంధిత నోటిఫికేషన్‌ను ఓపెన్ చేసి, దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా మంది ఉద్యోగార్ధులకు మంచి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలతో నిరుద్యోగుల కోసం కీలక అడుగులు వేస్తున్నది.

🛑Notification Newspaper Full Details Click Here