Good News : 12th అర్హతతో భారీగా రేషన్ డీలర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి | AP Ration Delears Recruitment 2024 | Latest jobs in Andhra Pradesh

Good News : 12th అర్హతతో భారీగా రేషన్ డీలర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి | AP Ration Delears Recruitment 2024 | Latest jobs in Andhra Pradesh

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Ration Dealer Jobs 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ తాజాగా రేషను డీలర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లు 40 సంవత్సరాల లోపల ఉన్న అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో డివిజన్లో వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న 152 రేషను డీలర్ల స్థానాలను భర్తీ చేయనున్నారు. దీనిద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని అందజేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఉంది. అన్ని మండలాల్లో రేషను దుకాణాలకు డీలర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించనున్నారు.

ఖాళీలు వివరాలు
డివిజన్లో మొత్తం 152 రేషను డీలర్ పోస్టులు భర్తీ చేయబడతాయి.

• పాత దుకాణాల ఖాళీలు: 81
• కొత్తగా ఏర్పాటు చేసిన దుకాణాలు: 71
• మొత్తం 152 పోస్టులు నియమించబడతాయి.

అర్హతలు

రేషను డీలర్ పోస్టుల కోసం అభ్యర్థులు అర్హతలు కింద పేర్కొన్న విధంగా ఉండాలి:

• వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాలు
• విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
• క్రిమినల్ కేసులు లేకపోవాలి
• స్థానికత సంబంధిత ప్రాంతానికి చెందినవారు మాత్రమే అర్హులు

రేషను డీలర్ల దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
దరఖాస్తు ప్రక్రియ కోసం కింది డాక్యుమెంట్లు అవసరం: విద్యార్హత సర్టిఫికెట్, స్థానికత ధృవపత్రం, ఆధార్ కార్డు, ఫోటోలు (పాస్‌పోర్ట్ సైజు), దరఖాస్తు ఫీజుకు సంబంధించిన రసీదు & క్రిమినల్ కేసుల నుండి విముక్తి సర్టిఫికెట్ తదితర డాక్యుమెంట్ కావాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం
• అభ్యర్థులు తమ దరఖాస్తులను తెనాలి సబ్కలెక్టర్ కార్యాలయంలో స్వయంగా సమర్పించవచ్చు.
• రిజిస్టరు పోస్టు ద్వారా కూడా దరఖాస్తులను పంపించవచ్చు.
• దరఖాస్తు సమర్పణకు 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది.

ఎంపిక ప్రక్రియ
• రాత పరీక్ష: 80 మార్కులు
• ఇంటర్వ్యూ: 20 మార్కులు
• రాత పరీక్ష తెనాలి డివిజన్లో 5వ తేదీన ఉదయం 9:30 గంటలకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలుగా ఉంటుంది.

ముఖ్యమైన సూచనలు
• అభ్యర్థులు పరీక్షకు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
• ఆహారంతోపాటు ఇతర వసతులు కేంద్రంలో అందుబాటులో ఉండవచ్చు.
• పరీక్ష ఫలితాలను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారు.
• ఎంపికైన అభ్యర్థులకు మరుసటి రోజు ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page