Anganwadi Recruitment 2024 : కేవలం 10th అర్హతతో కొత్త గా అంగన్వాడీ ఉద్యోగాలు అర్హతలు మరియు కావాల్సిన పత్రాలివే

Anganwadi Recruitment 2024 : కేవలం 10th అర్హతతో కొత్త గా అంగన్వాడీ ఉద్యోగాలు అర్హతలు మరియు కావాల్సిన పత్రాలివే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Notification : నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్షలు లేకుండా సొంత వార్డు లేదా పంచాయతీలో ఉద్యోగం. ఆంధ్రప్రదేశ్ లో వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. మొత్తం పోస్టులు 108 ఉన్నాయి. అభ్యర్థులు డిసెంబర్ 11 నుంచి 23వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఆర్గనైజేషన్ పేరు :  అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల నియామకం ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతుంది.

పోస్టులు ఖాళీ వివరాలు :
• అంగన్వాడీ కార్యకర్తలు: 15
• మినీ అంగన్వాడీ కార్యకర్తలు: 4
• అంగన్వాడీ ఆయాలు: 89

అర్హతలు

అంగన్వాడీ కార్యకర్తలు : 10వ తరగతి పాస్
మినీ అంగన్వాడీ కార్యకర్తలు : 10వ తరగతి పాస్
అంగన్వాడీ ఆయాలు : 7వ తరగతి పాస్

గమనిక: అభ్యర్థులు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. మహిళలై ఉండాలి. వివాహమై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ పోస్టుల కోసం అవసరమైన కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.

వయోపరిమితి

సాధారణ అభ్యర్థులు : 21 సంవత్సరాలు to 35 సంవత్సరాలు
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు : 18 సంవత్సరాలు to 35 సంవత్సరాలు

అంగన్వాడీ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (10వ తరగతి/7వ తరగతి మార్క్ షీట్స్)
• స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం
• కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల కోసం)
• వితంతువుల కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం
• ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

దరఖాస్తు విధానం
• దరఖాస్తు ఫారం పొందు విధానం: సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం పొందవచ్చు.
• పూర్తి చేసి సమర్పించడం: అభ్యర్థులు తమ ఫారాలను అన్ని అవసరమైన పత్రాలతో కలిసి సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయానికి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలి.
• సెలక్షన్ ప్రక్రియ: దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 11
దరఖాస్తుల ముగింపు: డిసెంబర్ 23

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

ఈ నోటిఫికేషన్ పై మరిన్ని వివరాలకు సంబంధిత టంగుటూరు, మార్కాపురం, మరియు ఒంగోలు ఐసీడీఎస్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *