రాత పరీక్ష లేకుండా వార్డెన్ జాబ్స్ : నెల జీతం 28,000/- వెంటనే అప్లై చేసుకోండి | Andhra Pradesh KGBV District Wise Notification 2024 All Details in Telugu చివరి తేదీ 13 అక్టోబర్ 2024
Andhra Pradesh Kasturba Gandhi Balika Vidyalaya Recruitment 2024 Notification All Details in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBV) లో ప్రిన్సిపల్ (Principal), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), సీఆర్టీ (CRT), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET), వార్డెన్, అకౌంటెంట్ & పార్ట్ టైం టీచర్ (PTT) ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 604 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు గడువు పొడిగింపు తేదీ: అక్టోబర్ 13, 2024 ఉంది ఇప్పుడు వరకు అప్లై చేసుకోపోతే వెంటనే అప్లై చేసుకోండి.
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 604 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ పై భర్తీ చేయబడతాయి, అంటే ఉద్యోగం కొంత కాలం మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు, అర్హతల వివరాలు, వయో పరిమితి, మరియు ఇతర సమాచారం తెలుసుకోవడం ముఖ్యం.
సంస్థ పేరు : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBV) సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో జాబ్స్
పోస్ట్ పేరు : ఈ నోటిఫికేషన్‌లో వివిధ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
• ప్రిన్సిపల్ (Principal)
• పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)
• సీఆర్టీ (CRT)
• ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)
• వార్డెన్
• అకౌంటెంట్
• పార్ట్ టైం టీచర్ (PTT) భర్తీ చేస్తున్న పోస్టులు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 604 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 507 టీచర్ పోస్టులు, 97 నాన్-టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
కింది విధంగా ఖాళీలు ఉన్నాయి:
• ప్రిన్సిపాల్ పోస్టులు: 10
• పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT): 165
• సీఆర్టీ (CRT): 163
• ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET): 4
• పార్ట్ టైం టీచర్ (PTT): 165
• వార్డెన్: 53
• అకౌంటెంట్: 44.
అర్హతలు :- అభ్యర్థులు పోస్ట్‌కు సంబంధించిన అర్హతలు కలిగి ఉండాలి.
ప్రిన్సిపాల్ పోస్టులకు పీజీ, బీఈడీ లేదా తత్సమాన అర్హత అవసరం. పీజీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 50%, బీసీ అభ్యర్థులకు 45%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40% మార్కులు ఉండాలి.
సీఆర్టీ (CRT) పోస్టులకు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
పీఈటీ (PET) పోస్టులకు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా లేదా డిగ్రీ, బీపీఈడీ లేదా ఎంపీఈడీ పూర్తి చేయాలి.
వార్డెన్ అర్హతలు: OC లకు మొత్తంగా కనీసం 50% మార్కులతో UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి; బీసీలకు 45%; SC/ST/ వికలాంగులకు 40%. మరియు OC లకు మొత్తంగా కనీసం 50% మార్కులతో NCTE/UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి B.Ed.,/M.A విద్యను కలిగి ఉండాలి; బీసీలకు 45%; SC/ST/విభిన్న వికలాంగులకు 40%.
అకౌంటెంట్ అర్హతలు: UGCకి అనుబంధంగా ఉన్న ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Com/B.Com (కంప్యూటర్) డిగ్రీని కలిగి ఉండాలి.
నెల జీతం :- విభిన్న పోస్టులకు వివిధ స్థాయిలో జీతాలు ఉన్నాయి.
• ప్రిన్సిపాల్ పోస్టులకు నెలకు ₹34,139 జీతం ఉంటుంది.
• సీఆర్టీ (CRT) పోస్టులకు మరియు పీఈటీ (PET) పోస్టులకు నెలకు ₹26,759 జీతం ఉంటుంది.
• పీజీటీ (PGT) పోస్టులకు కూడా ₹26,759 జీతం ఉంటుంది.
• ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET): పోస్టులకు కూడా ₹26,759 జీతం ఉంటుంది.
• పార్ట్ టైం టీచర్ (PTT): పోస్టులకు కూడా ₹₹18,500 జీతం ఉంటుంది.
• వార్డెన్: పోస్టులకు కూడా ₹18,500 జీతం ఉంటుంది.
• అకౌంటెంట్ : పోస్టులకు కూడా ₹18,500 జీతం ఉంటుంది.
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంది.
• మాజీ సైనికులకు 3 సంవత్సరాల సడలింపు ఉంది.
• దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంది.
దరఖాస్తు విధానం :- ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసే విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apkgbv.apcfss.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే ముందు, అన్ని వివరాలను సరిచూసి, సంబంధిత డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹250 రుసుము చెల్లించాలి. రుసుము చెల్లింపు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి.
ఎంపిక ప్రక్రియ
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసే విధానం రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో మార్కులు ఆధారంగా అభ్యర్థులను పిలిపించి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టులకు అనుగుణంగా సంబంధిత అర్హతల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 26, 2024
• దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2024
• దరఖాస్తు గడువు పొడిగింపు తేదీ: అక్టోబర్ 13, 2024
🔴Notification Pdf Click Here
🔴Apply Libk Click Here
తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు
నోటిఫికేషన్‌కు సంబంధించిన అర్హతలు ఏమిటి?
ప్రతి పోస్టుకు సంబంధించి ప్రత్యేక అర్హతలు ఉన్నాయి. ప్రధానంగా పీజీ, బీఈడీ, మరియు సంబంధిత Any డిగ్రీ విద్యార్హతలు అవసరం.
ఇంటర్వ్యూ ఉంటుందా?
అవును, రాత పరీక్ష తరువాత, ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు ఎంత?
దరఖాస్తు ఫీజు ₹250.
పోస్టుల ఖాళీలు ఎంత?
మొత్తం 604 పోస్టులు ఉన్నాయి, వీటిలో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి.