Anganwadi Vacancy 2021 in Telugu | Anganwadi Jobs
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
>తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
>జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
>అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.
>అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.
>నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.
>ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.
>ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.
>ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .
ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
>వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.
>అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.
>కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.
2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2021-22).
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
గమనిక :
1. SSC మెమోలో ఉన్న పేరు తో దరఖాస్తు దారు అన్లైన్ దరఖాస్తు చేసుకోవలెను. అలాగే నివాస మరియు కుల | ధృవీకరణ పత్రం SSC మెమోలో ఉన్న పేరు తో ఉండవలెను.
2. వివాహము తరువాత ఇంటి పేరు లో తేడాలు అనుమతించబడును.
3. వివాహము తరువాత అసలు పేరు మారినచో గెజిట్ లో ప్రచురించిన పత్రము ఉంటేనే దరఖాస్తు పరిగణన లోనికి తీసుకోనబడుతుంది.
4. అన్ని దృవీకరణ పత్రం లను దరఖాస్తు చేసిన తదుపరి సంబందిత CDPO కార్యాలయం లో అందచేయవలెను.