Anganwadi Recruitment 2022 Notification Apply Online Latest Job In Telugu

Anganwadi Recruitment 2022 Notification Apply Online Latest Job In Telugu

అంగన్వాడీ పోస్టుల భర్తీకి కసరత్తు ఖాళీలను గుర్తిస్తున్న అధికారులు స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాలో ఖాళీలను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తు న్నారు. జిల్లాలోని కణేకల్లు, కళ్యాణదుర్గం, కం బదూరు, ఉరవకొండ, గుత్తి, పెద్దవడుగూరు, అనంతపురం, కూడేరు, తాడిపత్రి, శింగనమల ప్రాజెక్టుల పరిధిలో 2,079 ప్రధాన అంగన్ వాడీ కేంద్రాలు, 223 మినీ అంగన్వాడీ కేం ద్రాలు ఉన్నాయి. వీటిలో చాలా పోస్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే రెండు దఫాలు భర్తీ చేశారు. ఉద్యోగ విరమణ, ఇతర కారణాలతో మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబం ధించిన ప్రక్రియ రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశముంది. అనంతరం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆయాలకు ఆయాల పదోన్నతులకూ గ్రీన్ సిగ్నల్ అనేక సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్లుగా పనిచేస్తున్న పదోన్నతులు ఇచ్చే అంశంపై అధికారులు దృ ష్టి సారించారు. అర్హత ఉన్న ఆయాలు దాదాపు 400 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. అర్హత కలిగిన ఆయాలను కార్యకర్తలుగా నియమించడం ద్వారా ఎన్ని భర్తీ అవుతాయనే అంశంపై సమాలోచనలు అధికారులు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి వస్తే అనం తరం ఖాళీగా ఉన్న కార్యకర్తలు, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు.

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు   

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

>తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

>జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 01/09/2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

>అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.

>అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.

>నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.

>ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.

>ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.

>ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.

>వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.

>అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

>కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2022-23).

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page