KGBVs Jobs : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలులో దరఖాస్తు ఆహ్వానం
KGBVs Accountant & ANM Contract Basis Notification 2026 : జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs)లోని ఖాళీగా ఉన్న అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేయడానికి అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి జె. విజయ సాగర్ గారు ఒక ప్రకటన తెలియజేశారు.

అభ్యర్థులు స్థానిక తరగతిలో ఉండవలెను ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా స్థానికంగా నిర్ణయించబడును 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. జిల్లాలో 1 అకౌంటెంట్ (Category OC), 1 A.N.M (Category – OC) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అకౌంటెంట్ పోస్టులకు కామర్స్ డిగ్రీతో పాటు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలలో సర్టిఫికేట్ కోర్సు (టాలీ, MS వర్డ్, ఎక్సెల్ మొదలైనవి) లేదా B.Com కంప్యూటర్లు అర్హత కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఎ.ఎన్.ఎం పోస్టుకు ఇంటర్మీడియట్తో పాటు ఎ.ఎన్.ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. అదేవిధంగా GNM కోర్సు లేదా B.Sc. నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఎంపిక పూర్తిగా మెరిట్ రోస్టర్ ఆధారంగా జరుగును.
పూర్తి సమాచారం అధికార వెబ్సైట్ లో https://rajannasiricilla.telangana.gov.in అందుబాటులో ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తిగల మహిళా అభ్యర్థుల జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎస్- 34 జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సముదాయము, రాజన్న సిరిసిల్ల యందు కింద తెలిపిన తేదీలలో దరఖాస్తులు సమర్పించగలరు.
ముఖ్యమైన తేదీ వివరాలు
• నోటిఫికేషన్ విడుదల : 29.11.2026
• దరఖాస్తుల స్వీకరణ : 30.11.2026 to 03.12.2026 2
• తాత్కాలిక మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ప్రదర్శన : 07.12.2026
• అభ్యంతరాలు స్వీకరణ : 08.12.2026
• తుది మెరిట్ లిస్ట్ మరియు షార్ట్ లిస్ట్ ప్రదర్శన : 09.12.2026
• సర్టిఫికెట్ వెరిఫికేషన్ : 11.12.2026

🛑Official Website Click Here
🛑Notification Pdf Click Here

