ఏపీలో పేదలకు తీపి కబురు.. ఇళ్లకు 2,50,000/- లక్షలు ఆర్థిక సహాయం.. కేంద్రం నుంచి ₹488 కోట్లు మంజూరు AP PMAY Urban 2.0 Housing Scheme
AP PMAY Urban 2.0 housing scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇళ్లను కట్టుకోవాలని ఎదురుచూస్తున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించారు. కొత్త గా అర్బన్ లో 17,922 ఇళ్లకు ₹448 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేశారు. అలాగే కొత్తగా ఏకంగా 4 లక్షల కొత్త ఇళ్లలు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ 2.0 కింద రాష్ట్రంలో లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ₹448 కోట్లు మంజూరు చేశారు. బెనిఫిస్టరి లిస్ట్ స్క్రీన్ (BLC) కింద 17,912 ఇళ్లకు ఈ నిధులను పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చారు. 2025-26, 2026-27 లో ఒక్కొక్క యూనిట్ కు 2,50,000/- లక్షగా నిర్ణయించింది ఇందులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, (₹1.5 లక్షలు), 40 శాతం (₹1 లక్ష) రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారు. ఈ నిధులు దశలవారీగా లబ్ధిదారులకు చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల లేని వారికి ప్రభుత్వం భారీ శుభవార్త తెలియచేశారు. ఏపీలో PMAY గ్రామీణ 2.0 కింద రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 లక్షల ఇళ్లలు కేంద్రం త్వరలో మంజూరు చేస్తున్నట్లు సమాచారం. ఈ స్కీం కింద ఇప్పటికే 77 వేల ఇళ్ళను ఇచ్చారు. మరి కొత్తగా నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు జిల్లాల వారీగా లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ₹2.39 లక్షల రూపాయలు అందచేయనున్నారు.


