ఏపీలో వారికి తీపికబురు.. ఆగస్టు 20 లోగా ఒక్కొక్కరి ఖాతాలో 25000.. జమ | AP Netannala Sevalo scheme
AP Netannala Sevalo scheme Financial assistance for new applicants by the 20th of this month :: ఆంధ్రప్రదేశ్ లో చేనేతనాల సేవలో పథకం కింద అందరికీ ఆర్థిక సహాయం అందిస్తామని నగదు జమ కాని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత గారు స్పష్టత చేశారు. కొత్తగా దరఖాస్తుదారులకు ఈనెల 20 లోపు ₹25,0000/- ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.

•ఆందోళన వద్దు, అర్హులందరికీ చేనేత సేవ అందిస్తాం.
•కొత్త దరఖాస్తుదారులను ఈ నెల 20 లోగా ₹25,0000/- ఆర్థిక సహాయం
•చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే చేనేతన్నాలకు అర్హత కలిగిన వారికి రూ.25 వేల ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలో జమ చేసామన్నారు. రాని వారికి మరియు మిగిలిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామని అర్హులు నా చేనేతల ఎవరు ఆందోళన చెందనవసరం లేదని మంత్రి గారు భరోసా ఇచ్చారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులు ఇప్పటివరకు అందని వారికి పూర్తిగా పరిశీలించి ఈనెల 20వ తేదీలోగా ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈనెల 7వ డబ్బులు విడుదల చేయగా దాదాపుగా 15000 అప్లికేషన్ పెండింగ్ ఉన్నట్లు సమాచారం. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఖాతాలో ఈనెల 20 లోపు రూ.25వేల చొప్పున తప్పకుండా జమ చేస్తామని మంత్రి స్పష్టత ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 71,536 మందికి చేనేతులకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. కొత్తగా 15 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు వారందరికీ కూడా పరిశీలించి ఈనెల 20 లోపు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా చేనేత సేవ పథకం పొందాలని భావిస్తే చేనేత కార్మికులు ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి. చేనేత సంఘంలో లేదా చేనేత సొసైటీలో సభ్యుడై ఉండాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి ఒకరికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఇందుకుగాను ఆధార్ కార్డు, చేనేత మగ్గం గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, ఇన్కమ్ సర్టిఫికెట్ రేషన్ కార్డు, సొసైటీ రిజిస్ట్రేషన్ కాఫీ ఇవన్నీ సరిగ్గా ఉన్నట్లయితే స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయం వేసి దరఖాస్తు చేసుకోవాలి రానివారు.
ముఖ్యంగా నేతన్న సేవలు పథకం రాణి అభ్యర్థులు వెంటనే తమ ఆధార్ కార్డు రేషన్ కార్డ్ చేనేత గుర్తింపు కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకొని గ్రామ స్వర్ణ వార్డు సచివాలయంలోకి వెళ్లి వెంటనే అప్లై చేసుకోండి. నెల 20 డైరెక్ట్ గా మీకు ₹25,000/- ఆర్థిక సహాయం అందుతుంది మీరు అర్హులు అయితే.


