ఏపీ రైతులకు భారీ శుభవార్త.. పొగాకు రైతులకు రూ.50 వేలు వడ్డీ లేని రుణం… కింటాకి 1000 రూపాయలు బోనస్ | AP Tobacco Farmers Scheme
AP Tobacco Farmers Scheme without interest RS.50000 Loan Update : ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతులకు అదిరిపోయే శుభవార్త. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు రెండేళ్ల పాటు వడ్డీ లేకుండా రూ.50,000/- ఆర్థిక సహాయం, ప్రభుత్వం తరఫున కింటాకు రూ.1000/- రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటన చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతులకు ఒక్కొక్కరికి రూ.50,000/- రుణం అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రుణాలు రెండేళ్లపాటు వడ్డీ లేకుండా రూ.50,000/- ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వం తరఫున పొగాకుకు క్వింటాలకు రూ.1,000/- రూపాయలు అందచేస్తామని తెలిపారు. పొగాకు కొన్న తొమ్మిది రోజులలో రైతుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుంటూరు జిల్లాలో తోబాకో బోర్డు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పొగాకు రైతుల సమస్యలు, కొనుగోలు తీరుపై, ధరలపై చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతులకు 50 వేల లోన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ లోనని రెండేళ్లలో చెల్లించవలసి ఉంటుందని కేంద్రమంత్రి పెమ్మాసాని చంద్రశేఖర్ మీడియా సమావేశంలో తెలిపారు. మొదటి సంవత్సరంలో సగం అమౌంటు, రెండో సంవత్సరంలో మిగిలిన అమౌంట్ చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ప్రతి పొగాకు రైతుకు ఇది వర్తిస్తుందని స్వస్థత ఇచ్చారు. దీనితో సుమారుగా 40 వేల మందిక లబ్ధి చేకూరుతుందని తెలిపారు.


