APలో మరో కొత్త పథకం.. వృద్ధాప్య పెన్షన్ నెలకు ఒక్కొక్కరికి ₹5000/- ఆర్థిక భరోసా..పూర్తి వివరాలు..
Andhra Pradesh Atal Pension Yojana Scheme 2026 Latest News : తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వృద్ధాప్య లో భద్రత కల్పించేందుకు ₹5,000/- పెన్షన్ పథకాన్ని అందిస్తుంది.

బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతినెల లేదా మూడు నెలలు లేదా ఆరు నెలలు ఒకసారి బ్యాంకులో డబ్బులు జమ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు 18 సంవత్సరాల వయసు చేరితే రూ.42 రూపాయలు నుంచి రూ.210 మధ్యలో ఉంటుంది. 40 ఏళ్ల వయసు చేరితే రూ.145 రూపాయల నుంచి రూ.1454 వరకు చెల్లించవలసి ఉంటుంది. ఈ స్కీం లో మీరు జాయిన్ అయినట్లయితే వృద్ధాప్యంలో రూ.1000/- రూపాయల నుంచి రూ.5000/- వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీంలో చేరితే 60 ఏళ్ల వయసు తర్వాత నెలవారీగా పెన్షన్ అందుతుంది. ఒకవేళ స్కీం లబ్ధిదారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతుంది. అలాగే ఇద్దరు కానీ మరణిస్తే వారి నామినీకి మొత్తం అందుతుంది. ఇప్పుడు వరకు ఈ స్క్రీన్ లో రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది చేరారు.
దేశవ్యాప్తంగా ప్రతి సామాన్య పౌరుడికి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేశారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ జనరల్ మేనేజర్ రమేష్ కుమార్ వెల్లడించారు. 2026- 27 సంవత్సరంలో 7.51 లక్షల మంది స్కీమ్ లో చేర్చే లక్ష్యం. ఈ పథకంలో చేరడానికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పథకంలో చేర్చవచ్చు. ఈ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరితే 60 సంవత్సరాలు తర్వాత వెయ్యి రూపాయల నుంచి రూ.5000/- రూపాయల వరకు హామీతో కూడిన వృద్ధాప్య పెన్షన్ అందుకోవచ్చు. ఈ పథకం తమ దగ్గర ఉన్న బ్యాంకులో ద్వారా పొందవచ్చు. అందుకుగాను ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ బ్యాంకు పాస్ బుక్, ఇన్కమ్ సర్టిఫికెట్ తదితర డాక్యుమెంట్ అవసరమవుతాయి.


