AP Outsourcing Employees : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… ఔట్సోర్సింగ్ సిబ్బందికి అంత్యక్రియల ఖర్చు రూ. 20 వేలకు పెంపు.
AP Outsourcing Employees Funeral Expenses Have Been Increased : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలలో పనిచేస్తూ మరణించిన ఔట్సోసియేషన్ సిబ్బందికి అంత్యక్రియల ఖర్చు ప్రభుత్వం 20 వేలకు పెంపు చేశారు. వీరికి కుటుంబ సభ్యులకు గతంలో 15000 ఇస్తున్నగా ప్రస్తుతం 20 వేలుకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని అర్బన్ లోకల్ బాడీల (ULBs) జనరల్ ఫండ్స్ నుంచే భరించాలని పేర్కొంది. దీంతో వేలాదిమందికి కాస్త ఊరట కలుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపాలిత పంచాయతీలో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలుగా మరణించిన ఔట్సోర్సింగ్ కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలత ఊరట కల్పించింది. ఔట్సోర్సింగ్ సిబ్బంది అకాల మరణం చెందడంతో వారి అంత్యక్రియ సంస్కారాలతో పైసా ఖర్చు లేకుండా గౌరవంగా వీడ్కోలు పలికేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం ద్వారా గతంలో మరణిస్తే ఔట్సోర్సింగ్ సిబ్బంది కుటుంబ సభ్యులకు 15000 మాత్రమే ప్రభుత్వం అందించేది అయితే ప్రస్తుతం ఖర్చును దృష్టిలో ఉంచుకొని ఆ మొత్తాన్ని 20 వేలకు పెంచుతూ ప్రభుత్వం తాజా జీవో పేర్కొన్నది. అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ సంబంధిత అర్బన్ లోకల్ బాడీస్ తక్షణమే భరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


